Tollywood: నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మకు తనకు నాని యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. ఛాన్స్ వస్తే తనతో నటించాలని ఉందని తెలిపింది.

Tollywood: నాని యాక్టింగ్ చాలా ఇష్టం.. అతడితో నటించాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్..
Nani

Updated on: Apr 21, 2025 | 5:50 PM

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ప్రభాస్, నాగచైతన్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అతి తక్కువ సమయంలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదిలేసుకుంటూ కొన్ని రోజులు సైలెంట్ అయ్యింది. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా తన మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తనకు న్యాచురల్ స్టార్ నాని యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. తనతో కలిసి సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన పూజా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న పూజా.. ఇప్పుడు కోలీవుడ్ హీరో సూర్యతో కలిసి రెట్రో చిత్రంలో నటిస్తుంది. ఈ యాక్షన్ డ్రామా మే 1న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆక్టటుకున్నాయి. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజాను ఉద్దేశిస్తూ.. తెలుగులో ఇంకా ఏ హీరోతో కలిసి నటించాలని అనుకుంటున్నారని అడగ్గా.. పూజా మాట్లాడుతూ.. నాని యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అతడి యాక్టింగ్ అద్భుతంగా ఉంటుందని.. నాని నటించిన నిన్ను కోరి మూవీ చాలా ఇష్టమని తెలిపింది. నానితో సినిమా ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే .. నిన్ను కోరి సినిమా 2017లో విడుదలైంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. ఇందులో నాని, నివేధా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. మరోవైపు సూర్య, పూజా హెగ్డే కలిసి నటించిన రెట్రో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో వీరిద్దరు ఢీగ్లామర్ లుక్ లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..