Pooja Hegde: బుట్టబొమ్మకు ఎంత కష్టం వచ్చింది.. విషాదంలో పూజాహెగ్డే..

దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా బాధల మునిగిపోయింది. అమ్మడి ఇంట ఓ విషాద సంఘటన జరిగింది. దాంతో పూజాతోపాటు ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పూజాహెగ్డే తాను ఎంతగానో ఇష్టపడే అమ్మమ్మ మరణించారు.

Pooja Hegde: బుట్టబొమ్మకు ఎంత కష్టం వచ్చింది.. విషాదంలో పూజాహెగ్డే..
Pooja Hegde Pic

Updated on: Jan 13, 2024 | 12:48 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒకానొక టైం లో చక్రం తిప్పింది పూజాహెగ్డే. తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసి సినిమాలు చేసింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా బాధల మునిగిపోయింది. అమ్మడి ఇంట ఓ విషాద సంఘటన జరిగింది. దాంతో పూజాతోపాటు ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పూజాహెగ్డే తాను ఎంతగానో ఇష్టపడే అమ్మమ్మ మరణించారు. దాంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన అమ్మమ్మ చనిపోయారని తెలిపింది. విల్‌ మిస్‌ యూ అజ్జి అంటూ ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది పూజ.

ఇటీవలే పూజాహెగ్డే చెల్లి పెళ్లి ఘనంగా జరిగింది. ఆ పెళ్ళిలో పూజాహెగ్డే సందడి చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతలోనే ఇలా తన అమ్మమ్మ చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది పూజ.

తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడంతో ఆ బాదనుసోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది పూజాహెగ్డే. దాంతో ఈ అమ్మడిని ఓదారుస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దైర్యంగా ఉండండి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. పూజాహెగ్డే సినిమాల విషయానికొస్తే ఈ మధ్య వరుసగా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ  నిరాశపరుస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది పూజా. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది ఈ బుట్టబొమ్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.