Pooja Hegde: మరోసారి బన్నీకి జోడీగా బుట్టబొమ్మ.. ఆ ముద్దుగుమ్మకే ఓట్లు వేస్తున్న మేకర్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 07, 2021 | 9:56 AM

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‏లో దూసుకుపోతున్న హీరోయిన్. లైలా కోసం అంటూ సినీ పరిశ్రమకు ఎంట్రీ

Pooja Hegde: మరోసారి బన్నీకి జోడీగా బుట్టబొమ్మ.. ఆ ముద్దుగుమ్మకే ఓట్లు వేస్తున్న మేకర్స్..
Pooja Hegde

Follow us on

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‏లో దూసుకుపోతున్న హీరోయిన్. లైలా కోసం అంటూ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన చిన్నది.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తిరిక లేకుండా గడిపేస్తుంది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మతో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషలలో ప్రస్తుతం ఈ అమ్మడు హవా నడుస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే చేసిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యంగ్ హీరో అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసింది పూజా హెగ్డే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అటు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేసింది. ఇక ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ అమ్మడు మరోసారి బన్నీకి జోడీగా నటించబోతుంది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ .. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బన్నీ వెంటనే ఐకాన్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ. పుష్ప సినిమా షూటింగ్ కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బన్నీ మాత్రం వీలైనంత తొందరగా ఐకాన్ సినిమాను పట్టాలెక్కించానుకుంటున్నాడట. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తూనే.. నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‏గా పూజా హెగ్డేను తీసుకోవాలని బావిస్తున్నాడట డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇందుకు అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్లుగా టాక్. ఇప్పటికే వీరిద్దరు జోడీగా వచ్చిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరోసారి బన్నీ.. పూజాతో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న పూజా హెగ్డేను హీరోయిన్‏గా తీసుకోవడానికి నిర్మాత దిల్ రాజ్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu: నాగార్జున గారు.. బోర్ కొట్టేస్తుంది.. తనను తీసుకురావలంటూ నెట్టింట్లో రచ్చ..

Bigg Boss 5 Telugu: అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. మిగిలిందే ఆ ముగ్గురే.. సింగిల్స్‏ను అందుకే పంపారంటూ లహరి షాకింగ్ కామెంట్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu