
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్య సాచి సినిమాతో హీరోయిన్ గ పరిచయం అయ్యింది అందాల భామ నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే అందంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నిధి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో అందాలు ఆరబోసి ఆకట్టుకుంది నిధి. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందాలు వడ్డిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఫోజులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి.