నేను ఆ హీరోయిన్‌ను ఏం అనలేదురా బాబు..! క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్

|

Jan 14, 2025 | 3:20 PM

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ నిధి అగర్వాల్. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు రావడం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారును పడగొట్టిన నిధికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు నటిగా కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కేవలం ఏడు సినిమాల్లోనే నటించింది.

నేను ఆ హీరోయిన్‌ను ఏం అనలేదురా బాబు..! క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్
Nidhi Agarwal
Follow us on

నిధి అగర్వాల్.. సాలిడ్ హిట్ పడలేదు కానీ ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో ఇప్పుడు మారుమ్రోగేది. ఈ హాట్ బ్యూటీ భారీ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినీ ముద్దుగుమ్మ తెలుగులో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నప్పటికీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధి అగర్వాల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆతర్వాత అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

దాంతో ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది . మిస్టర్ మజ్ను సినిమా తర్వాత రామ్ పోతినేని, పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతోపాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిధి గ్లామర్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత వరుస సినిమాలతో నిధి అగర్వాల్ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెలుగులో అవకాశాలు తలుపు తట్టకపోవడంతో తమిళ్ వైపు వెళ్ళింది. కానీ అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

ఇక ఇప్పుడు ఈ చిన్నది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాజసాబ్ సినిమాలో చేస్తుందీ హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే మొన్నామధ్య నిధిఅగార్వల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. తెలుగులో సినిమాలు చేసే హీరోయిన్స్ తెలుగు భాషను నేర్చుకోరు.. నేను అందరికి నమస్కారం అనే బ్యాచ్ కాదు అని కామెంట్స్ చేసింది. అయితే ఆమె అన్నది కాజల్ అగర్వాల్ ను అని చాలా మంది నిధిని ట్రోల్ చేశారు. ఎందుకంటే కాజల్ ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమెకు తెలుగు రాదు. అయితే నిధి అన్నది కాజల్ నే అని కొందరు నెటిజన్స్ భావించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని పై క్లారిటీ ఇచ్చింది నిధి. ఆతను అన్నది కాజల్ ను కాదు అని చెప్పుకొచ్చింది. నేను ఎవ్వరిని ఉద్దేశించి అనలేదు నేను నాగురించి మాత్రమే చెప్పను అని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి