Nidhhi Agerwal: ఇండస్ట్రీలో టాలెంట్‏తో పని ఉండదు.. కావాల్సిందంతా అదే.. హీరోయిన్ నిధి అగర్వాల్ సెన్సెషనల్ కామెంట్స్..

|

Oct 14, 2022 | 1:33 PM

ఇండస్ట్రీలో ఉండాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. అందం కూడా ఉండాలంటుంది. అంతేకాదు.. పెద్ద హీరోల సినిమాలో ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ లెక్కచేయనంటుంది.

Nidhhi Agerwal: ఇండస్ట్రీలో టాలెంట్‏తో పని ఉండదు.. కావాల్సిందంతా అదే.. హీరోయిన్  నిధి అగర్వాల్ సెన్సెషనల్ కామెంట్స్..
Nidhhi Agerwal
Follow us on

సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‏గా నిలిచింది. కానీ నిధికి మాత్రం తెలుగులో అవకాశాలు ఎక్కువగానే తలుపు తట్టాయి. ఈ మూవీ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ అవకాశాలు అందుకుంటుంది నిధి. అయితే ఇండస్ట్రీలో ఉండాలంటే కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. అందం కూడా ఉండాలంటుంది. అంతేకాదు.. పెద్ద హీరోల సినిమాలో ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ లెక్కచేయనంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నిధి.. ఇండస్ట్రీ, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవాళ్లు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా ? లేదా ? వారు అదే చూస్తారు. రాబోయే సినిమాల్లో హీరోయిన్ల పని గ్లామర్ షో చేయడమే. గ్లామర్ కోసం ప్రేక్షకులు కూడా థియేటర్లలోకి వస్తుంటారు. అందుకే నేను గ్లామర్ షో చేయడానికి వెనుకాడను. అందుకు నో చెప్పను. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఏ దర్శకుడైన వస్తే రెమ్యునరేషన్ డిమాండ్ చేయను. వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. లేదంటే నా మినిమమ్ అమౌంట్ ఇదే అని చెప్పేస్తాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే ఆ తర్వాత అవకాశాలు తప్పకుండ వస్తాయని నాకు తెలుసు.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇందులో నర్తకిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన నిధి ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ మారుతీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో నిధితోపాటు మాళవిక మోహనన్ కూడా ఎంపికైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అదికారిక ప్రకటన రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.