Nidhhi Agerwal: ఆ హీరో సూపర్.. అతనితో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది..

అందాల భామ నిధిఅగార్వల్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొన్నటివరకు టాలీవుడ్ సినిమాలో మెరిసిన ఈ భామ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో ఈ అమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nidhhi Agerwal: ఆ హీరో సూపర్.. అతనితో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది..
Nidhhi Agerwal

Updated on: Jan 03, 2026 | 11:58 AM

యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అందాల భామ. ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకులను అలరించిన నిధి ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక రాజా సాబ్ సినిమాతో నిధి అగర్వాల్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది.

ఈ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ ది రాజాసాబ్ గురించి తన అనుభవాలను పంచుకుంది. ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ, తన పాత్ర పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. నేను చాలా సంతృప్తి చెందాను. నా పాత్ర చాలా చక్కగా రాశారు. నా పాత్ర సినిమా కథను ముందుకు తీసుకెళ్తుంది అని నిధి అన్నారు. ది రాజాసాబ్ కథ, ప్లాట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని నిధి అగర్వాల్ హైలైట్ చేశారు. ఇది చాలా ఎంగేజింగ్ థింగ్. ఒకే ప్లాట్, అన్ని పాయింట్లు ఆ ప్లాట్‌తో కనెక్ట్ అవుతాయి అని నిధి చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ను స్వీటెస్ట్ పర్సన్, బంగారం అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్, ప్రభాస్‌లతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. వారితో పని చేసినప్పుడు క్వాలిటీ సమయాన్ని గడిపానని, అందుకే వారితో మళ్ళీ పనిచేయడానికి ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. ఇక రాజా సాబ్ సినిమా జనవరి 9న విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.