Mrunal Thakur: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. త్వరలోనే అంటూ..

హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Mrunal Thakur: పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. త్వరలోనే అంటూ..
Mrunal Thakur

Updated on: Dec 08, 2023 | 9:07 AM

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి తెలుగులో తొలి సినిమానే ఘనవిజయం సాధించింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆయిపోయింది.

తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో చేసింది. ఈ సినిమా నిన్న అంటే డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాయ్ నాన్న సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.

ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆమె న్యూజెర్సీ వెళ్ళింది. తాజాగా అక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. హాయ్ నాన్న సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలో సమయమా. అమ్మడి సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సీతారామం సినిమానుంచి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు అని తెలిపింది. ఇంతలో అక్కడ[ఆ ఉన్న ఓ పిల్లడు మీకు పెళ్లైందా..? అని ప్రశ్నించాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా అని సమాధానం ఇచ్చింది మృణాల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.