Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయంటూ..

సినిమా ఆర్టిస్టుల జీవితాలు గందరగోళంగా చిత్రవిచిత్రంగా ఉంటాయంటోంది టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ (mehreen pirzadaa).

Mehreen Pirzada: జీవితం గురించి మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయంటూ..
Actress

Updated on: Mar 22, 2022 | 4:09 PM

సినిమా ఆర్టిస్టుల జీవితాలు గందరగోళంగా చిత్రవిచిత్రంగా ఉంటాయంటోంది టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ (mehreen pirzadaa). తమ జీవితాల్లో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే తెలుసుకోవడం కష్టమంటూ మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా (ఆర్టిస్టుల) జీవితాలు గందరగోళంగా చిత్రవిచిత్రంగా ఉంటాయి. సినిమాల్లోని పాత్రలకు తగినట్టుగా మా శారీరాకృతిని మార్చుకోవడానికి కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులకు షూటింగ్ షెడ్యూల్స్‏కు తగ్గట్టుగా జీవనశైలీలో ఎప్పటికప్పుడు మార్పులు జరగడం సర్వసాధారణం. అంతేకాకుండా.. జీవితాల్లో ఎత్తు పల్లాలు సహజం. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయి. విజయం దక్కిందని ఆనందించేలోగా మరో వైఫల్యం వెంటాడుతుంది. ఎండా.. వాన.. చలి అనే వాటిని లెక్కచేయకుండా షూటింగ్స్‏లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ముందే తెలిసినా ఇదే రంగాన్ని ఎంచుకుంటాం. సినిమాల కారణంగా కుటుంబానికి.. స్నేహితులకు దూరంగా ఉంటాం. ఈ విషయాలన్ని తెలిసినా ఇదే రంగాన్ని ఎంచుకుని ఇందులోకి వస్తాం ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం వెంకటేష్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తమన్నా మరో హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Mehrin

Also Read: Sundaram Master: నవలాలోకంలో నిశీధి.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు

RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

Viral Photo: త్వరలో మమ్మీగా ప్రమోషన్‌ అందుకోనున్న.. ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా.?

RRR Movie: రికార్డుల విషయంలో రాజీపడేది లేదు.. రోజు రోజుకు అంచనాలు పెంచుతున్న ఆర్ఆర్ఆర్