AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya: సౌందర్య వెళ్లిన ఆ ఫ్లైట్‌లోనే నేనూ ఉండాల్సింది, కానీ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువైన హీరోయిన్ సౌందర్య. వందలాది సినిమాల్లో తన సహజమైన నటనతో ఆకట్టుకుందీ అందాల తార. కానీ 31 ఏళ్ల వయసులోనే అందులోనూ సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడే ఎవరు ఊహించని విధంగా విమాన ప్రమాదంలో కన్నుమూసిందీ ముద్దుగుమ్మ.

Soundarya: సౌందర్య వెళ్లిన ఆ ఫ్లైట్‌లోనే నేనూ ఉండాల్సింది, కానీ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
Actress Soundarya
Basha Shek
|

Updated on: Jul 06, 2026 | 7:21 PM

Share

సౌందర్య… తెలుగు సినిమా ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇప్పటి తరం ఆడియెన్స్ కూడా ఈ అందాల తార గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మహానటి సావిత్ర తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టమైన హీరోయిన్ సౌందర్యనే అని చెప్పవచ్చు. తనదైన అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించిందీ అందాల తార తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య. అది కూడా కేవలం 12 సంవత్సరాల వ్యవధిలో. అలాంటిది సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉన్న సమయంలోనే ఎవరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది సౌందర్య. 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ఈ నటి కన్నుమూసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రయాణిస్తోన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 31 ఏళ్ల సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా చనిపోయారు. ఈ వార్త యావత్ సినీ పరిశ్రమను,ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే సౌందర్య ప్రయాణించిన అదే హెలికాఫ్టర్ లో తాను కూడా వెళ్లాల్సిందని.. కానీ చివరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అయ్యిందని ఓ తెలుగు హీరోయిన్ తెలిపింది. ఆమె మరెవరో కాదు సౌందర్య బెస్ట్ ఫ్రెండ్ మీనా. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ సౌందర్యతో తన అనుబంధం, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

‘ సినిమా ఇండస్ట్రీలో సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్. సినిమాల పరంగా మా మధ్య పోటీ ఉన్నా అది చాలా హెల్దీగానే ఉండేది. మేమిద్దరం సిల్వర్ స్క్రీన్ మీద పోటీ పడినా బయట మాత్రం ఎంతో స్నేహంగా ఉండే వాళ్లం. అలాంటిది ఆమె మరణవార్త విని నేను తట్టుకోలేకపోయా. నిజం చెప్పాలంటే.. ఆ రోజు నేను కూడా సౌందర్యతో కలిసి ఆ ఫ్లైట్ లోనే వెళ్లాల్సి ఉంది. నన్ను కూడా ఎన్నికల ప్రచారానికి పిలిచారు. కానీ నాకు రాజకీయాలు, ప్రచారాలు ఇష్టం లేవు. అందుకే సినిమా షూటింగ్ ఉందని చెప్పి వెళ్లలేదు. కానీ తర్వాత ఆ ఘటన జరిగిందని తెలిసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే నేను కూడా ఆ హెలికాప్టర్‌లో ఉండేదానిని” అని అప్పటి విషాదాన్ని గుర్తు చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

దృశ్యం 3 సినిమాలో మీనా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే