AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena : ఆ స్టార్ హీరోతో సూపర్ హిట్ మిస్సయ్యాను.. ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ మీనా. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఓ హీరోతో సూపర్ హిట్ చిత్రాన్ని మిస్సయ్యానని అంటుంది. ఆ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉందని చెబుతుంది.

Meena : ఆ స్టార్ హీరోతో సూపర్ హిట్ మిస్సయ్యాను.. ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
Meena
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 2:15 PM

Share

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకిగా వెలిగిన నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆమెది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే, తన కెరీర్‌లో రజనీకాంత్ సరసన నటించిన ఒక అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నానని, ఆ తర్వాత ఆ పాత్రలో సౌందర్య నటించారని మీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రజనీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘నరసింహా’ (తమిళంలో పడయప్ప). ఈ సినిమాలో రజనీ సరసన సౌందర్య కథానాయికగా నటించి మెప్పించారు. అయితే, నిజానికి ఆ పాత్ర కోసం దర్శకుడు కె.ఎస్. రవికుమార్ మొదట మీనాను సంప్రదించారట. కానీ ఆ సమయంలో మీనా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు. దాంతో ఆ గోల్డెన్ ఛాన్స్ సౌందర్య వద్దకు వెళ్ళింది.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఆ పాత్రను వదులుకోవడం గురించి మీనా మాట్లాడుతూ.. “నరసింహా సినిమాలో సౌందర్య పోషించిన వసుంధర పాత్ర చాలా హుందాగా, పద్ధతిగా ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఇంత మంచి పాత్రను నేను ఎందుకు వదులుకున్నానా అని కొంచెం బాధగా అనిపించింది. కానీ సౌందర్య ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె నటన చూశాక, ఆ పాత్రకు ఆమె తప్ప మరెవరూ సెట్ అవ్వరని అనిపించింది” అని మనసులో మాట చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..

మీనా బాలనటిగా రజనీకాంత్‌తో ‘అన్బుల్ల రజనీకాంత్’ వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిన తర్వాత కూడా ‘యజమాన్’, ‘వీరా’, ‘ముత్తు’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. రీసెంట్‌గా ‘అన్నాత్తే’ (పెద్దన్న) సినిమాలో కూడా ఆమె రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయినప్పటికీ, రజనీకాంత్ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నరసింహా’లో భాగం కాలేకపోవడం మాత్రం తన కెరీర్‌లో ఒక చిన్న వెలితిగా ఉండిపోయిందని ఆమె పేర్కొన్నారు. సౌందర్య, రజనీకాంత్ కాంబినేషన్ ‘అరుణాచలం’, ‘నరసింహా’ చిత్రాల ద్వారా ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ‘నరసింహా’లోని వసుంధర పాత్రలో సౌందర్య కనబరిచిన అమాయకత్వం, గౌరవం ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. ఆ పాత్ర వల్లనే ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన క్లాస్ లుక్ వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..

Follow Us