అంత పెద్ద హీరో అయ్యుండి.. నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు.. షాకింగ్ విషయం చెప్పిన మమతా మోహన్ దాస్

నటి మమతా మోహన్‌దాస్ ఓ స్టార్ హీరోతో కలిసి ఒక సినిమా సెట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక సినిమా పాట షూటింగ్ కోసం స్టార్ హీరోతో కలిసి నటించడానికి తనను ఆహ్వానించారని ఆమె తెలిపారు. అప్పుడు ఊహించని సంఘటన జరిగిందని తెలిపింది మమతా..

అంత పెద్ద హీరో అయ్యుండి.. నాకు ఫోన్ చేసి సారీ చెప్పాడు.. షాకింగ్ విషయం చెప్పిన మమతా మోహన్ దాస్
Mamatha Mohan Das

Updated on: Jun 07, 2026 | 7:12 PM

నటి మమతా మోహన్‌దాస్ తన కెరీర్ తొలినాళ్లలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించే అవకాశం లభించినప్పుడు ఎదురైన ఒక సంఘటనను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు మమతా. 2007 సమయంలో, ఒక సినిమా పాట చిత్రీకరణ కోసం రజినీకాంత్ గారితో కలిసి డ్యాన్స్ చేయడానికి తనను పిలిచారని మమత వెల్లడించారు. అప్పుడు తను దుబాయ్‌లో వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నప్పటికీ, రజినీకాంత్ గారి పట్ల ఉన్న అపారమైన గౌరవం కారణంగా ఆ షూటింగ్‌ను వదిలి ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి వచ్చానని ఆమె తెలిపారు.  ఈ పాటలో మమతా మోహన్‌దాస్ ఒక డైరెక్టర్‌గా, రజినీకాంత్‌తో కలిసి పాటలో ఆడుతున్నట్లు షూట్ చేశారట. ఇది ఒక సినిమా లోపల ఇంకో సినిమా షూటింగ్ జరిగితున్నట్టు ఉండే కాన్సెప్ట్‌తో కూడిన పాట. తాను లొకేషన్‌కు చేరుకున్న తర్వాత షూటింగ్ ఆలస్యమైందని, గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని మమత పేర్కొన్నారు. రోజుల తరబడి షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, చివరికి తన షాట్లు ఏవీ సినిమాలో లేవని ఆమెకు తెలిసిందట. సినిమాలో తాను కేవలం ఒక క్యాప్ అంచు మాత్రమే కనిపించే ఒక బ్యాక్ షాట్‌లో ఉన్నానని, తన ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదని ఆమె అన్నారు.

ఈ సంఘటన తనను తీవ్రంగా నిరాశపరిచిందని, నాలుగు రోజులు విలువైన సమయం వృథా అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ, పాటలో తన భాగం ఎందుకు తీసేశారో తనకు తెలియదని, అయితే మెయిన్  హీరోయిన్ మరొక నటి వచ్చి డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడలేదని, అందుకే తన పాత్ర తీసేశారని తాను విన్నానని మమత తెలిపారు. ఇది వదంతులు మాత్రమే కావచ్చని, దీనిపై తనకు పూర్తి స్పష్టత లేదని ఆమె అన్నారు. ఆ సమయంలో తాను ఎలాంటి వివాదం సృష్టించకుండా మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు మమత మోహన్ దాస్.

అయితే, ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత, మమతా మోహన్‌దాస్‌కు రజినీకాంత్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. స్వయంగా రజినీకాంత్ గారే ఫోన్‌లో మాట్లాడి, తన సమయాన్ని వృథా చేసినందుకు, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి వచ్చినందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారని మమత తెలిపింది. “ఇది నా కంట్రోల్ ఉన్న ఏకైక విషయం. నా వంతుగా నేను చేయగలిగింది ఇదే” అని రజినీకాంత్ గారు చెప్పినట్లు మమత పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఏదో తప్పు జరిగిందని, కానీ అది ఏమిటో తనకు ఎవరూ చెప్పలేదని మమత తెలిపారు. రజినీకాంత్ గారి ఈ వినయానికి, వృత్తిపరమైన మర్యాదకు తాను ఎంతో ప్రభావితమయ్యానని ఆమె అన్నారు. ఆయన ఒక సూపర్ స్టార్ అయి ఉండి కూడా వ్యక్తిగతంగా కాల్ చేసి క్షమాపణ చెప్పడం తనను ఎంతగానో ఆకట్టుకుందని మమత మోహన్ దాస్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us