Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది మాళవికా మోహనన్ (Malavika Mohanan).

Malavika Mohanan: ఆ వార్తలు బాధను కలిగిస్తాయి.. అయినా మంచి అనుభవమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాళవిక..
Malavika

Updated on: Mar 09, 2022 | 3:46 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది మాళవిక మోహనన్ (Malavika Mohanan). అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ కాలేదు కానీ.. మాళవికా మాత్రం ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో మాళవికా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తమిళ్, మాలయాళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ జోష్‏లో ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన మారన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మాళవికా.. తాజాగా సోషల్ మీడియాలో తనపై వచ్చే రూమర్స్ పై స్పందించింది.

మాళివికా మాట్లాడుతూ.. ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో.. పూర్తి నిడివి గల పాత్రను మారన్ సినిమాలో చేసినట్టుగా తెలిపింది. అలాగే ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు బాధ కలిగిస్తున్నా.. అలాంటివి జరగడం.. వాటి నుంచి మంచి అనుభవం కూడా వస్తుందని మాళవికా తెలిపింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బయోపిక్ తీస్తే.. అందులో తను ఆమె పాత్రలో నటించాలని ఉందని తెలిపింది. తన లేటేస్ట్ ఫోటోషూట్స్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు మాళవికా.. చాలాసార్లు ఆమె చేసే పోస్టుల కారణంగా ట్రోల్స్ కూడా జరిగాయి. ఇక ఆ మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‏తో మాళవికా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన లేటెస్ట్ ఫొటోస్.

Samyuktha Menon: భీమ్లానాయక్ బ్యూటీకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు.