ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి కూతుళ్లను చూశారా.? అందంలో హీరోయిన్లు కూడా పనికిరారు

|

Oct 16, 2024 | 1:45 PM

ఆ రోజుల్లో భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ని ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు మాధవి. అప్పట్లోనే ఈమె తెలుగు , హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ ఇలా అన్ని బాషలలో కలిపి 300కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధవి కూతుళ్లను చూశారా.? అందంలో హీరోయిన్లు కూడా పనికిరారు
Tollywood
Follow us on

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎందరో.. హఠాత్తుగా కనుమరుగైన సంగతి తెలిసిందే. కొందరు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోతే.. మరికొందరు ఈ సెలబ్రిటీ లైఫ్‌కి దూరంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో ఒకరే సీనియర్ నటి మాధవి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ నటి 90వ దశకంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అందం, అభినయంతో అప్పటి స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీనిచ్చింది. బికినీ వేసి తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొట్టడమే కాదు.. నటనతో ప్రేక్షకుల కంటతడి పెట్టించేసింది ఈ అందాల తార. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన మాధవి.. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు సినిమాలకు ఒక్కసారిగా గుడ్ బై చెప్పింది.

1996లో బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని.. అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది. అక్కడే భర్త బిజినెస్‌లు చూసుకుంటూ బిజీగా మారిపోయింది. ఇకపోతే మాధవికి ముగ్గురు ఆడపిల్లలు. వారి పేర్లు టిఫనీ, ప్రిసిల్లా, ఎవలిన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవి.. అప్పుడప్పుడు తమ కూతుళ్ల ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. పిల్లల ముగ్గురికి భరతనాట్యం నేర్పించింది మాధవి. అమ్మను మించిన అందంగా, హీరోయిన్లు సైతం అసూయ పడేలా ఉన్నారు మాధవి కూతుళ్లు. వీరికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోవడంతో.. చదువుకుంటూ.. తండ్రి బిజినెస్ విషయాలను చూసుకుంటున్నారు.

ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి