Laya Home Tour: హీరోయిన్ లయ రీఎంట్రీ ఇవ్వబోతుందా ?.. చాలా కాలం తర్వాత హోం టూర్ చేసిన అందాల తార..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతోపాటు.. సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను తెలుపుతూ హోం టూర్ చేశారు.

Laya Home Tour: హీరోయిన్ లయ రీఎంట్రీ ఇవ్వబోతుందా ?.. చాలా కాలం తర్వాత హోం టూర్ చేసిన అందాల తార..
Laya

Updated on: Feb 26, 2023 | 12:32 PM

ఒకప్పుడు అందం, అభినయంతో తెలుగు తెరపై మాయ చేసిన హీరోయిన్స్ ఇప్పుడు ఫ్యామిలీతో సమయం గడిపేస్తున్నారు. కొందరు సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలతో బిజీగా ఉంటున్నారు. మరికొందరు మాత్రం తమ ఫుల్ టైమ్ కుటుంబానికి వెచ్చించారు. అలాంటివారిలో హీరోయిన్ లయ ఒకరు. స్వయం వరం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఆమె.. తొలి చిత్రంతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పారు లయ. కానీ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్స్, రీల్స్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నారు లయ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతోపాటు.. సినీ కెరీర్ కు సంబంధించిన విషయాలను తెలుపుతూ హోం టూర్ చేశారు.

ఆ వీడియోలో తనకు వచ్చిన అవార్డ్స్ గురించి చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు మూడు నంది అవార్డ్స్ వచ్చాయని.. ప్రస్తుతం తనకు వచ్చిన పురస్కారాలు అన్ని ఇక్కడే ఉన్నాయని.. త్వరలోనే వాటిని అమెరికా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. తమ ఇంట్లో పెంచుకునే పక్షుల గురించి చెప్పుకుంటూ చిరునవ్వులు చిందించారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాల్లో నటించానని.. అందులో 40 సినిమాలు తెలుగులోనే అని అన్నారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో అన్ని చీరలు కట్టుకుని షూటింగ్ చేశామని.. అప్పుడప్పుడు జీన్స్, షర్ట్స్ వేస్తామంటే నిర్మాతలు ఒప్పుకునేవారు కాదన్నారు లయ. అలాగే తనకు అరవింద సమేతా చిత్రంలో అవకాశం వచ్చిందని.. కానీ తను చేయలేదని అన్నారు. ఇప్పుడు అవకాశాలు వస్తే నటించేందుకు సిద్దమని తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.