Lakshmi Vasudevan: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన నటి.. ఫోటోలు మార్ఫింగ్‌ చేశారంటూ ఆవేదన

సోషల్ మీడియా చేతికొచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగిన అది క్షణాల్లో వైరల్ గా మారుతోంది.

Lakshmi Vasudevan: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన నటి.. ఫోటోలు మార్ఫింగ్‌ చేశారంటూ ఆవేదన
Lakshmi Vasudevan

Updated on: Sep 27, 2022 | 6:55 PM

సోషల్ మీడియా చేతికొచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ప్రపంచ నలుమూలల ఎక్కడ ఏం జరిగిన అది క్షణాల్లో వైరల్ గా మారుతోంది. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందొ అంటే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా సినిమా తరాలకు సోషల్ మీడియా వల్ల ఇబ్బందుల పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ హీరోయిన్ కూడా సైబర్ నేరగాళ్ల వల్ల ఇబందులు ఎదుర్కొంది. తన ఫోటోలను అసభ్యకారంగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఇంతకు ఆ నటి ఎవరంటే.. మెంటల్ గా నన్ను డిస్టర్బ్ చేసి డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకున్నారని ఆ నటి ఓ వీడియో ద్వారా ఏడ్చేసింది. తమిళ సీరియల్‌ నటి లక్ష్మీ వాసుదేవన్‌ చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఇప్పుడు ఈ అమ్మడు సైబర్ నేరగాళ్ల వలలో పడింది. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా వాట్సాప్‌లో ఉన్న వారందరికీ.. అలాగే ప్రేక్షకులకు ఈ మెసేజ్‌ చెప్పాలని  ఈ వీడియో చేయడం జరిగింది అని చెప్పుకొచ్చింది. నా ఫొటోలను ఎవరో మార్ఫింగ్‌ చేసి,మరీ ముఖ్యంగా అసభ్యకరంగా చేసి నా వాట్సాప్‌లో ఉన్న వారందరికి ఓ కొత్త నెంబర్‌ నుండి పంపుతున్నారు. నాలా ఎవ్వరూ మోసపోకూడదు.. సెప్టెంబర్‌ 11న నా ఫోన్ కు ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో నాకు రూ.5 లక్షల రూపాయల వరకు లక్కీ డ్రా మనీ వచ్చినట్లు ఉంది. అత్యాశకు పోయి నేను ఆ లింక్‌ను క్లిక్‌ చేశాను. అప్పుడు ఓ యాప్‌ నా మొబైల్ లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయింది. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన కాసేపటికే నా ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. తర్వాత నేను ఆ సంగతి మర్చిపోయాను. కొన్నిరోజుల తర్వాత నాకు కొన్ని మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయ్యాయి . మీరు లోన్‌ తీసుకున్నారు.. ఐదు వేల రూపాయల లోన్‌ తీసుకున్నారు అంటూ మెసేజ్ లు వచ్చాయి. అయితే  లోన్‌ కట్టలేదు అంటూ ఫోన్‌ కాల్స్‌, వాయిస్‌ మెసేజ్‌లు వస్తున్నాయని.. అందులో బూతులు తిడుతున్నారని. 5 వేల కట్టకపోతే మీ మార్ఫింగ్‌ ఫొటోలు అందరికీ పంపుతామని బెదిరిస్తున్నారు. అయితే నా మార్ఫింగ్ ఫోటోలు నా స్నేహితులకు, తల్లిదండ్రులకు, అలా నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వెళ్లాయి. దీంతో నేను హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. తప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుని అనుభవిస్తున్నాను. అంటూ బోరుమని ఏడ్చేసింది లక్ష్మీ వాసుదేవన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.