Actress Lakshmi: అప్పట్లో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటిగా సంచలనం.. ఎక్కువ తక్కువ అహం చూపించడమే కారణమన్న…

|

Sep 24, 2021 | 9:51 AM

Actress Lakshmi: అచ్చతెలుగమ్మాయి దక్షిణాది సీనియర్ నటి లక్ష్మి.. ఇప్పటివారికి మురారి, జీన్స్ వంటి సినిమాల్లో నటించిన అమ్మ, బామ్మగా పరిచయం.. అయితే లక్ష్మి తల్లి రుక్మిణి, అమ్మమ్మ..

Actress Lakshmi: అప్పట్లో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటిగా సంచలనం.. ఎక్కువ తక్కువ అహం చూపించడమే కారణమన్న...
Actress Lakshmi
Follow us on

Actress Lakshmi: అచ్చతెలుగమ్మాయి దక్షిణాది సీనియర్ నటి లక్ష్మి.. ఇప్పటివారికి మురారి, జీన్స్ వంటి సినిమాల్లో నటించిన అమ్మ, బామ్మగా పరిచయం.. అయితే లక్ష్మి తల్లి రుక్మిణి, అమ్మమ్మ నుంగబాక్కం జానకిలు కూడా నటులే.. వీరి వారసత్వంలో లక్ష్మి వెండి తెరపై అడుగు పెట్టింది. అంతేకాదు.. లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా నటికావడం విశేషం. 1952, డిసెంబరు 13 న మద్రాసులో జన్మించిన లక్ష్మి తండ్రి తండ్రి వై.వి.రావు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు సినీ దర్శకుడు, నటుడు. తల్లి రుక్మిణి తమిళ నటి. కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి 15 ఏళ్లకే  సినీ పరిశ్రమలో నటిగా అడుగు పెట్టింది. 1968 లో  ‘జీవనాంశమ్’ అనే తమిళ సినిమాతో తెరంగ్రేటం చేసిన లక్ష్మి 1970వ దశకంలో లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది.  మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో “మిస్ జూలీ ప్రేమకథ” (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు  విమర్శకుల ప్రశంసలను పొందింది లక్ష్మి. తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా జీన్స్ , హల్‌చల్ , వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది.

లక్ష్మి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నా.. వైవాహిక జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు, అంతే కాదు మొదటి భర్త ని కాదని మరో రెండు పెళ్లిళ్లు కూడా చేసుకోవడం అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం. లక్ష్మీ కేవలం 15 ఏళ్ల వయసులోనే పెద్దలు కుదిర్చిన సంబంధం .. భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత కొన్ని మనస్పర్ధలు తో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులు.

అనంతరం 1975లో తన సహ నటుడు మోహన్ శర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ 1980లో విడాకులు ఇచ్చేశారు.  మళ్ళీ ఏడు సంవత్సరాలు తర్వాత నటుడు, దర్శకుడు శివ చంద్రన్ అనే నటుడిని వివాహం చేసుకున్నారు. అప్పట్లో మూడో పెళ్లి చేసుకున్న దక్షిణాది నటిమణిగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. కన్నడ నటుడు అనంత్ నాగ్ తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో టాక్.

ఇక లక్ష్మి పెళ్లిళ్ల విషయంలో పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎందుకు అలా పెళ్లిళ్లు చేసుకున్నారు అని అడిగితే.. లక్ష్మి ఒకే ఒక సమాధానం చెప్పే వారు. ఒకరు తక్కువ నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏ మాత్రం నచ్చదు..  మగాళ్ళు చూపించే గర్వం అధికారం అందుకు ఒక కారణం అని లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. శివ చంద్రన్ తో తన జీవితం సంతోషంగా ఉందని లక్ష్మి వివరణ ఇచ్చారు.

Also Read:   డిగ్రీ చదివి..ఇంగ్లీష్‌పై మంచి పట్టుందా.. అమెజాన్‌లో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..