NagaChaitanya-Samantha: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ నాగచైతన్య సమంత విడాకుల గురించే చర్చ జరుగుతుంది. నిన్నమొన్నటివరకు అన్యుణ్యంగా ఉన్న ఈ లవ్లీ కపుల్ సడన్‌గా విడిపోతున్నట్టు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్‌తో ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు. దాదాపు చై సామ్‌ది దాదాపు 11 ఏళ్ల బంధం. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు. ముఖ్యంగా తన శరీరం మీద చైతూ గుర్తులను టాటూలుగా వేయించుకున్నారు సామ్. కాని విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. సమంత కూడా తన పేరులో అక్కినేని పదాన్ని తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చింది. ఒక దశలో సమంత బాంబేకు షిఫ్ట్ అయినట్టు ప్రచారం జరిగింది. కాని తనకు హైదరాబాద్ అంటే ఇష్టమని కొద్దిరోజుల క్రితం ట్విస్ట్ ఇచ్చారు సామ్. చివరకు సోషల్ మీడియాలో ఇద్దరు విడాకులపై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
ఇదిలా ఉంటే సమంత- నాగచైతన్య విడిపోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. విడాకులకు నాగచైతన్య కారణమని కొందరు అంటుంటే.. మరికొందరు సమంత కారణమని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్స్ పై సీనియర్ నటి ఖుష్బూ సీరియస్ అయ్యారు. నెటిజన్ల తీరు పై ఆమె మండిపడ్డారు. ఖుష్బూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘సమంత- చైతన్య మధ్య ఏదైనా జరిగితే .. అది వాళ్ల వ్యక్తిగతం. విడిపోవడానికి కారణం ఏంటనేది వాళ్లిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియదు. వాళ్ల వ్యక్తిగత విషయాలను మనం గౌరవించాలి. దయచేసి మీకిష్టం వచ్చినట్లు ఊహించుకోకండి’ అని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చారు.
What happens between a couple,is between them. Nobody knows the actual reason why they part ways, except the two of them. What we can do as human is to respect their privacy n give them space to understand the situation more. Stop assuming, speculating n coming to conclusions. ?
— KhushbuSundar (@khushsundar) October 2, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :