
తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో కృతి కర్బంద ఒకరు. బోణీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కానీ ఆ సినిమాతో ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది. కానీ రామ్ పోతినేని జోడిగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో ఈ బ్యూటీకి పాపులారిటీ వచ్చేసింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది కృతి. త్వరలోనే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇటీవలే అతడితో కృతి కర్బంద నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో వీరి ఎంగెజ్మెంట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఏడాదిలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం వేడుక ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోలలో కృతి, పుల్కిత్ చేతికి ఒకే రకమైన ఉంగరాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆ ఫోటోలలో వారి ఇల్లంతా అందంగా అలకరించారు.. దీంతో వీరిద్దరూ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫోటోలను పుల్కిత్ మాత్రమే తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. కానీ ఈ విషయం పై కృతి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. వీరిద్దరు కలిసి తైష్, పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. 2019 నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో వివాహం చేసుకున్నారు. ఆమె సల్మాన్ ఖాన్కు సోదరి అవుతుంది. దీంతో పుల్కిత్ తొలి చిత్రం బిట్టు బాస్ ను సల్మాన్ ప్రమోట్ చేశాడు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరు 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పుల్కిత్ హీరోయిన్ యామీ గౌతమ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీరు 2018లో విడిపోయారు. ఇక ఆ తర్వాత 2019 నుంచి కృతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. పుల్కిత్ ప్రస్తుతం రిస్కీ రోమియో చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.