
ప్రముఖ నటి కియారా అద్వానీ శుభవార్త చెప్పింది. కియారా అద్వానీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కియారా, సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను వెల్లడించారు. కియారా అద్వానీ తల్లయ్యిందని తెలియగానే ఆమె అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.ఈ స్టార్ కపుల్ వివాహం ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో చాలా వైభవంగా జరిగింది. ‘షేర్షా’ సినిమా సెట్స్‌లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు.
కియారా, సిద్ధార్థ్ తొలిసారి ‘లస్ట్ స్టోరీస్’ సినిమా ముగింపు పార్టీలో కలిశారు. ఈ పరిచయం మొదట స్నేహంగా, ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. 2019 లో, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత 2021లో, కియారా , సిద్ధార్థ్ ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నారు. ఫైనల్ గా 2023లో పెళ్లి చేసుకున్నారు.
మొన్నామధ్య జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ 2025 లో కియార బేబీ బంప్ తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కియారా అద్వానీకి బేబీ పుట్టింది తెలియడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కియారా ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.