Actress Khushboo: నో లాజిక్స్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్ సినిమాపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

Actress Khushboo: నో లాజిక్స్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్ సినిమాపై  సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
Actress Khushboo Sundar

Updated on: Feb 03, 2026 | 6:31 PM

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘మన శంకరవప్రసాద్ గారు’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.400 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చిరంజీవి మార్క్ కామెడీ, డ్యాన్స్ లు, ఫైట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ‘మన శంకరవప్రసాద్ గారు’ సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మెగా మూవీపై ప్రశంసలు కురిపించారు నటి ఖుష్బు సుందర్. మన శంకరవరప్రసాద్ గారు సినిమాను చూసిన ఆమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మన శంకర వరప్రసాద్‌గారు సినిమా చాలా అద్భుతంగా ఉంది. లాజిక్ లేదు, అంతా మ్యాజిక్ మాత్రమే. సూపర్ డూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ అని నిరూపించుకున్న దర్శకుడు అనిల్‌రావిపూడికి నా హృదయపూర్వక అభినందనలు.తనను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చిరంజీవిని చూసి చాలా గర్వంగా ఉంది.
రింతకాలం మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్’ అని చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు ఖుష్బూ.

ఇక ఇదే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన వెంకటేశ్‌ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఖుష్బూ ట్వీట్..

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు భీమ్స్ స్వరాలు సమకూర్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..