AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 10 ఇడ్లీలు,10 దోసెలు తింటా.. అయినా ఫిట్‌గా ఉంటా..! షాకింగ్ విషయం చెప్పిన అందాల భామ

ఫిట్ నెస్ కోసం హీరోయిన్స్ నిత్యం జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు. అలాగే సన్నజాజిలా కనిపించడానికి రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇక ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం తనకు నచ్చింది తింటాను అని చెప్పింది.

రోజుకు 10 ఇడ్లీలు,10 దోసెలు తింటా.. అయినా ఫిట్‌గా ఉంటా..! షాకింగ్ విషయం చెప్పిన అందాల భామ
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2025 | 7:19 PM

Share

హీరోయిన్స్ చాలా మంది సన్నజాజిలా కనిపించడానికి రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. హీరోయిన్స్ చాలా మంది మితంగా తింటారు. పైగా కొలస్ట్రాల్ లేని ఫుడ్, ఎక్కువగా జ్యూస్ లాంటి ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అలాగే జిమ్ లో కసరత్తులు చేస్తూ చమట్లు చిందిస్తుంటారు. తాజాగా ఓ అందాల భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికర గా మారాయి. తాను రోజుకు 10దోసెలు , 10 ఇడ్లీలు తింటాను అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు, తమిళ్ భాషల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఆ అమ్మడు. చేసింది తక్కువ సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..

తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది భామలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంతో మంది సక్సెస్ కూడా అయ్యారు. వారిలో కీర్తిసురేష్ ఒకరు. 2013లో గీతాంజలి అనే సినిమాతో హీరోయిన్ గా మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం కథానాయికగా సైమా అవార్డ్ అందుకుంది. 2015 నాటికి కీర్తి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.

సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ

తెలుగుతోపాటు హిందీలోకి తెరంగేట్రం చేసింది. కానీ హిందీలో ఆమెకు ఊహించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు. 2024 డిసెంబర్ లో తన చిరకాల స్నేహితుడు ఆంటోని థాటిల్ ను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరి వివాహం గోవాలో మలయాళీ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తుంది. అలాగే రివాల్వర్ రీటా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫుడ్ విషయంలో నాకంటూ కంట్రోల్ ఉండదు. ఏది కావాలంటే అది తింటాను. మనస్ఫూర్తిగా నాకు నచ్చింది తింటానని చెప్పుకొచ్చింది. నేను రోజుకు 10 ఇడ్లీలు , లేదా 10 దోసెలు తింటానని తెలిపింది. ఇష్టంగా తిన్నప్పటికీ నేను వర్కౌట్స్ చేస్తానని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైడ్రాపై వెనుకంజ వేసే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రాపై వెనుకంజ వేసే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..