
సినిమా ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆ మధ్యన ఇదే విషయంపై దీపికా పదుకొణె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె తర్వాత చాలా మంది హీరోయిన్లు వర్కింగ్ అవర్స్ పై మాట్లాడారు. తాజాగా మహా నటి కీర్తి సురేష్ ఇదే విషయంపై స్పందించింది. తన లేటెస్ట్ సినిమా రివాల్వర్ రీటా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను 9 టు 6 అయినా చేయగలను. అలాగే 9 టు 9 అయినా వర్క్ చేయగలను. కానీ 9 గం లకు చిత్రీకరణకు అందుబాటులో ఉండాలంటే నటులు, ఉదయం 5 గం లకు లేచి 7:30 కల్లా సెట్ లో ఉండాలి. 6 గంట లకు చిత్రీకరణ పూర్తయితే ఇంటికి వెళ్లటానికి 9 గంలు అవుతుంది. అదే 9 టు 9 కాల్షీట్ అయితే ఇంటికి వెళ్లటానికి రాత్రి 11 గంటలు దాటెస్తుంది. ఇక వర్కౌట్ చేసి ప్రెష్ అయి నిద్రపోవటానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఏ మనిషికయినా ముఖ్యమనే ఎనిమిది గంటల నిద్ర అనేది మాకు ఎక్కడుంది.! అవసరం అనుకుంటే నేను ఎన్ని గంటలయినా నటిస్తాను. కానీ టెక్నిషియన్స్ మాకంటే ఎక్కువ సమయం సెట్ లో ఉంటారు.
వారికింక రెండు మూడు గంటల నిద్రే ఉంటుంది. సౌత్ లో ముఖ్యంగా తెలుగు తమిళ్ లో మనకు 8 గంటల వర్కే ఉంటుంది. మలయాళం, హిందీల్లో 12 గంటల కాల్షీట్ ఉంటుంది. అక్కడ కనీసం బ్రేక్ కూడా ఉండదు. 12 గంటలు కంటిన్యూస్‌గా పని చేయాలి.. వాళ్లు 3 నుంచి 4 గంటలు మాత్రమే పడుకుంటారు. ఫుడ్, వర్కౌట్ లాగే.. నిద్ర కూడా అవసరమే.. కానీ 9 టూ 9 అంటే చాలా కష్టమైపోతుంది. 9 టూ 6 చేస్తేనే 5 గంటల నిద్ర ఉండట్లేదు. మనిషికి నిద్ర అనేది అవసరం.. అదే ఉండట్లేదిప్పుడు. టెక్నికల్ టీం అయితే కనీసం 2 గంటలే పడుకుంటారు’ అని చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం ఈ హీరోయిన్ వ్యాఖ్యలు నెట్టింట వైరలవుతున్నాయి.