నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై పోలీసులు ఆమెను గచ్చిబౌలి లో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల సహకారం తొ నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెలుగువారి పై అసభ్యకర వ్యాఖ్య లు చేసిన విషయం తెలిసిందే. కస్తూరి అరెస్ట్ చేసి చెన్నైకి తరలిస్తున్నారు పోలీసులు.ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.
తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పుతున్న కొందరు అంటూ వారిని ఉద్దేశించి ఎప్పుడో దశాబ్దాల క్రితం రాణుల దగ్గర సేవలు చేయడానికి వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళనాడు చలామణి అవుతూ.. మాట్లాడుతున్నారని తెలుగువారిని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపాయి.
తమిళనాడులో ఉన్న తెలుగు వారు అంతఃపురంలో ఊడిగం చేసుకోవడానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారా తెలుగువారు అంటే ఎంత చిన్నచూపు ఎందుకు అంటూ తెలుగు సంఘాలు నటి కస్తూరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో పోలీసులు కూడా కస్తూరి వ్యాఖ్యల విషయాన్ని సీరియస్ గా తీసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం అజ్ఞాతంలో ఉన్న కస్తూరి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.