Karate Kalyani: కరాటే కల్యాణి సంచలన కామెంట్లు.. నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ..

|

Jun 06, 2023 | 11:33 PM

ప్రముఖ నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనపై అభ్యంతరం తెలిపిన ఆమె ఇటీవల తరచూ ఏదో ఒక విషయంలో అందరి నోళ్లలో నానుతారు. తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన కామెంట్లు చేశారీ సీనియర్‌ నటీమణి.

Karate Kalyani: కరాటే కల్యాణి సంచలన కామెంట్లు.. నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ..
Actress Karate Kalyani
Follow us on

ప్రముఖ నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనపై అభ్యంతరం తెలిపిన ఆమె ఇటీవల తరచూ ఏదో ఒక విషయంలో అందరి నోళ్లలో నానుతారు. తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన కామెంట్లు చేశారీ సీనియర్‌ నటీమణి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కరాటే కల్యాణి.. ‘నాకు ప్రాణ హాని ఉంది. ఈ మధ్యనే నా కారు రెండు టైర్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారు. గుడి దగ్గర గొడవ జరుగుతుందంటే నేను ఈ మధ్య హిందూత్వ వాదులతో కలిసి కారులో వెళుతున్నాను. అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నప్పుడు కారు టైర్ పేలిపోయింది. అదే హైవే రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరిగితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఈ ప్రమాదం తర్వాత ఆ కార్ టైర్ చూసిన మెకానిక్ లు ఆ టైర్ ను ఎవరో ముందే కొంచెం కోసేశారని తెలిపాడు. నా మీద కోపంతోనే ఎవరో కావాలని అలా చేశారు. ఈ గొడవకు టీడీపీకి సంబంధం లేదు. రాజకీయం అంతా ఖమ్మంలోనే జరుగుతుంది. ఎన్టీఆర్ కు దైవత్వాన్ని ఆపాదించే క్రమంలో కొంతమంది ఆయన విగ్రహాన్ని కృష్ణుని రూపంలో పెడుతున్నారు. కృష్ణుడికి ఒక రూపం ఉంది. ఆయన రూపంలో మనుషుల విగ్రహాలు పెట్టడం సరికాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు కల్యాణి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తెలుగు నాట హాట్ టాపిక్‌గా మారాయి.

కాగా ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి కరాణే కల్యాణి చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. అయితే, నిర్ణీత గడువులోగా ఆమె వివరణ ఇవ్వక పోవడంతో అసోసియేషన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. మొత్తానికి ఇలా ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్న కరాటే కల్యాణి తాజా వ్యాఖ్యలు మరింత హాట్‌ టాపిక్‌గా మారాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..