Kangana Ranaut: అదిరిందమ్మా కంగనా..!! పొలిటికల్ ఎంట్రీ.. కాస్ట్లీ కారు.. వారెవ్వా.!.

చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది ఈ చిన్నది. బాలీవుడ్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ చిన్నది. ఏకంగా స్టార్ హీరోలను టార్గెట్ చేసి కామెంట్స్ చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ చిన్నది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ బీజేపీలో జాయిన్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఓ కొత్త కారు కొన్నది.

Kangana Ranaut: అదిరిందమ్మా కంగనా..!! పొలిటికల్ ఎంట్రీ..  కాస్ట్లీ కారు.. వారెవ్వా.!.
Kangana Ranaut

Updated on: Apr 08, 2024 | 7:40 PM

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నిత్యం ఎదో ఒక విధంగా వార్తల్లో నిలిస్తునే ఉంటుంది. కాంట్రవర్సీలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది ఈ చిన్నది. బాలీవుడ్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ చిన్నది. ఏకంగా స్టార్ హీరోలను టార్గెట్ చేసి కామెంట్స్ చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ చిన్నది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ బీజేపీలో జాయిన్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఓ కొత్త కారు కొన్నది. కంగనా రనౌత్ కొత్త కారును కొనుగోలు చేసింది. దాంతో ఇది హాట్ టాపిక్ గా మారింది.

కొద్ది రోజుల క్రితం కంగనా అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరింది . హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.  మెర్సిడెస్ (Mercedes Maybach GLS) కారు అభ్యర్థి కంగనా రనౌత్ కొనుగోలు చేసింది. దీని ధర 2.46 కోట్ల రూపాయలు! కంగనా రనౌత్ తన కొత్త కారుతో అందరి దృష్టిని ఆకర్షించింది. కంగనా రనౌత్ మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగానే ఉంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించింది. ఇప్పుడు అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చేసింది. బీజేపీలో చేరిన వెంటనే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇంతకు ముందు కూడా కంగనా రనౌత్‌కు లగ్జరీ కారుకొంది. ఇంతకు ముందు కొనుగోలు చేసిన మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్680 ధర రూ.3.6 కోట్లు. ఆదివారం (ఏప్రిల్ 7) ముంబై వీధుల్లో కంగనా రనౌత్ కొత్త కారు నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. కంగనా రనౌత్ మొదటి నుంచి తన ముక్కు సూటి తనంతో చాలా విమర్శలు ఎదుర్కొంది. రాజకీయాల్లోకి రాకముందు శివసేన పార్టీతో విభేదించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి