Janhvi Kapoor: ఓ ఊపు ఊపేసిన జాన్వీ.. పాప్‌ స్టార్‌ రిహానాతో కలిసి స్టెప్పులేసిన ఎన్టీఆర్ భామ

|

Mar 02, 2024 | 2:29 PM

జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధమైంది. జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు పెళ్లి వేడుకలు, వివాహానికి హాజరయ్యే అతిథులు ఉండేందుకు 5 స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

Janhvi Kapoor: ఓ ఊపు ఊపేసిన జాన్వీ.. పాప్‌ స్టార్‌ రిహానాతో కలిసి స్టెప్పులేసిన ఎన్టీఆర్ భామ
Janhvi Kapoor
Follow us on

ఆదేశంలోనే అత్యంత సంపన్నులో ఒకరైన అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.ఈ వేడుకలోజులైలో అనంత్- రాధిక వివాహం జరగనుండగా.. జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధమైంది. జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు పెళ్లి వేడుకలు, వివాహానికి హాజరయ్యే అతిథులు ఉండేందుకు 5 స్టార్ హోటళ్లను తలదన్నే విధంగా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిదీ అట్టహాసంగా జరుగుతుంది. ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అన్నట్టుగా అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. గుజరాత్ లోని జామ్ నగర్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవ కార్యక్రమంతో ముందస్తు పెళ్లి వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు.

అలాగే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం వరల్డ్‌ పాప్‌ సూపర్‌ స్టార్‌ రిహానా కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ఆమె ఓ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆమెకు భారీగా ముట్టజెప్పుతున్నారు. ఒక్క షో కోసం రిహానాకు ఏకంగా 75 కోట్ల వరకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే ఈ వేడుకకు తారా లోకం కూడా కదిలి వెళ్ళింది. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది . ఈ ఇద్దరు కలిసి ఆ వేడుకలో డాన్స్ చేశారు. రిహానాతో కలిసి జాన్వీ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోను జాన్వీ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక జాన్వీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.