Isha Koppikar: ఆ హీరోలతో రొమాన్స్ చేయడం కంఫర్ట్‏గా ఉండదు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా రమన్నాడని తెలిపింది. అలాగే చాలా మంది నటీమణులతో అసభ్యకంగా ప్రవర్తిస్తారంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. అంతేకాకుండా సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయడం అసౌకర్యంగా ఉంటుందని.. అసలు కంఫర్ట్ గా ఉండదని చెప్పుకొచ్చింది.

Isha Koppikar: ఆ హీరోలతో రొమాన్స్ చేయడం కంఫర్ట్‏గా ఉండదు.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Isha Koppikar
Follow us

|

Updated on: Jun 23, 2024 | 11:30 AM

సినిమా ఓ రంగుల ప్రపంచం. నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ఎన్నో కష్టాలను, అడ్డంకులను అధిగమించి స్టార్ డమ్ సంపాదించుకుంటారు. అయితే ఒకటి రెండు చిత్రాల్లో నటించి అనుకోకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు కొంతమంది హీరోయిన్స్. అందులో ఇషా కొప్పికర్ ఒకరు. కెరీర్ మొదట్లో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ భామా.. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం సైలెంట్ అయిన ఇషా.. ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కెరీర్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితులు.. సినిమాల గురించి ఆసక్తి విషయాలను చెప్పుకొచ్చింది. అలాగే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఓ స్టార్ హీరో తనను డ్రైవర్ లేకుండా ఒంటరిగా రమన్నాడని తెలిపింది. అలాగే చాలా మంది నటీమణులతో అసభ్యకంగా ప్రవర్తిస్తారంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. అంతేకాకుండా సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయడం అసౌకర్యంగా ఉంటుందని.. అసలు కంఫర్ట్ గా ఉండదని చెప్పుకొచ్చింది.

“మీకంటే 30 లేదా 40 ఏళ్లు పెద్దవారితో పనిచేస్తున్నప్పుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వయసు పైబడిన స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్నప్పుడు .. వారితో రొమాన్స్ సీన్స్ చేస్తున్నప్పుడు అసలు నచ్చదు. కంఫర్ట్ గా అనిపించదు. వారికి కౌగిలించుకున్నప్పుడు తండ్రిని హత్తుకున్నట్లుగా అనిపిస్తుంది.. భాగస్వామిని కాదు. నేను సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు నాకు అలాగే అనిపించింది. నేను కొత్త కదా అనుకున్నాను. యాక్టింగ్ సమయంలో కేవలం నటనపై మాత్రమే దృష్టి పెడతాము.. అప్పుడు వారు మనకంటే పెద్దవారనే విషయాన్ని మార్చిపోతాము. కొంతమంది హీరోలు తమ వయసును కనిపించకుండా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. కానీ కొందరి ప్రవర్తన, సీనియర్ అనే యాటిట్యూడ్ కారణంగా వారి వయసు స్పష్టంగా తెలిసిపోతుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి హీరోయిన్ అమ్మగా, వదినగా కనిపిస్తుంది. కానీ హీరో మాత్రం ఇంకా తనకంటే చిన్నవారైన 25 ఏళ్ల నటితో నటిస్తున్నాడు. వాళ్లు ఎలా కనిపిస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. ఇది రాబోయే కాలంలో మారుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు ముర్ఖులు కాదు. వారి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సూటిగా చెబుతారు” అంటూ చెప్పుకొచ్చింది ఇషా కొప్పికర్.

ఇషా కొప్పికర్ తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో నటించింది. అలాగే ప్రేమతో రా, కేశవ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ భాషలోల అనేక చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినమాలకు పూర్తిగా దూరమైంది ఇషా కొప్పికర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
క్యాబ్ డ్రైవర్ల కష్టాల జర్నీ.. వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు..
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
మీరు కూడా జిమ్‌కి వెళ్తున్నారా..? ఇలాంటి ట్రైనర్స్ తో జర భద్రం..!
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
వర్షాకాలంలో మీ ఇల్లు అందంగా ఉండలా? ఈ చిట్కాలు పాటిస్తే సూపర్‌
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..