AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana : తెలుగులో ఆ హీరో నా ఫేవరేట్.. అతడితో నా స్క్రీన్ కెమిస్ట్రీ బెస్ట్.. ఇలియానా కామెంట్స్..

ఇలియానా డిక్రూజ్ .. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన గోవా బ్యూటీ. తనదైన నడుము వంపులతో, గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచుకుని, టాలీవుడ్‌లో ‘ఇలియానా క్రేజ్’ అనే కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఒక దశాబ్దం పాటు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

Ileana : తెలుగులో ఆ హీరో నా ఫేవరేట్.. అతడితో నా స్క్రీన్ కెమిస్ట్రీ బెస్ట్.. ఇలియానా కామెంట్స్..
Ileana
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 1:14 PM

Share

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఊపేసిన స్టార్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. తనదైన గ్లామర్, నటనతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ అమ్మడు.. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు సరసన ఆమె నటించిన పోకిరి చిత్రం ఇలియానా కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా.. ఇప్పుడు తన ఇద్దరూ కుమారులతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోలపై చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను తెగ ఖుషీ చేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

ఈ వీడియోలో యాంకర్ ఇలియానాను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “మీరు నటించిన హీరోల్లో.. జూనియర్ ఎన్టీఆర్ (తారక్), రామ్, మహేష్ బాబు, ప్రభాస్.. వీరిలో ఎవరితో మీ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని మీరు అనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. దీనికి ఇలియానా కాసేపు ఆలోచించి “నేనైతే తారక్ (Tarak) అనే చెప్తాను. తారక్‌తోనే నా స్క్రీన్ కెమిస్ట్రీ బెస్ట్” అంటూ ఎన్టీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్‌లో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రాఖీ’ (Rakhi – 2006), అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘శక్తి’ (Shakti – 2011) సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘రాఖీ’ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తారక్ ఎనర్జీకి మ్యాచ్ అవుతూ ఇలియానా అప్పట్లో చేసిన డ్యాన్స్ స్టెప్స్ కూడా ఒక ఊపు ఊపాయి. మహేష్ బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘మున్నా’, రామ్‌తో ‘దేవదాసు’ వంటి భారీ హిట్స్ ఉన్నప్పటికీ.. నటన, టైమింగ్ విషయంలో తారక్‌తో ఉన్న కంఫర్ట్ లెవెల్స్ వేరని ఇలియానా చెప్పకనే చెప్పింది. ఇలియానా చేసిన ఈ కామెంట్స్ పాతవే అయినప్పటికీ, ప్రస్తుతం ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తరుణంలో ఈ వీడియోను తారక్ ఫ్యాన్స్ నెట్టింట విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

ఇలియానా, ఎన్టీఆర్ ఫోటో.. 

Ileana., Jr Ntr

Ileana., Jr Ntr

ఎక్కువమంది చదివినవి : Reema Sen : ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. ప్రతి విషయంతో తనతోనే షేర్ చేసుకుంటాను.. రీమా సేన్..

Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ