Ileana D’Cruz: ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసిన ఇలియానా.. కారణమేంటంటే..

|

Oct 31, 2021 | 2:08 PM

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే

Ileana DCruz: ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసిన ఇలియానా.. కారణమేంటంటే..
Ileana Dcruz
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సరసన దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ గోవా బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. పోకిరి, జల్సా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూనే. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లు అందుకుంది. ఇక బర్ఫీ సినిమా తర్వాత బాలీవుడ్‏లో బిజీ హీరోయిన్‏గా మారిపోయింది. అయితే బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏గా ఈ ముద్దుగుమ్మ .. తెలుగు చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమయ్యింది. ఇక గత కొద్ది రోజులుగా అటు బాలీవుడ్‎లోనూ సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలియానా ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసింది.

ఇలియానా కిచెన్ లో వంటచేస్తూ.. తన వేళ్లను కట్ చేసుకుంది. ఇక ఇన్‏స్టాలో తన వేళ్లను చూపిస్తూ చిన్న పిల్లలా ఏడ్చేసింది. వంట చేసేటప్పుడు నా రెండు వేళ్లను పొరపాటున కట్ చేసుకున్నా.. ఆ తర్వాత బ్యాండేజ్ వేస్తున్న సమయంలో చిన్నపిల్లలా ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. అలాగే ఇంతకుముందు చాలాసార్లు వంట చేస్తున్న సమయంలో వేళ్లను కట్ చేసుకున్నానని.. అలా కట్ చేసిన ప్రతిసారి ఏడ్వడం తప్పేమికాదు అనిపించింది అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

Ileana

2012లో రణబీర్ కపూర్.. ప్రియాంక చోప్రా నటించిన బర్ఫీ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇక ఈ సంవత్సరం హంగామా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఇలియానా.. తన గురించి తనకు ఇంకా పూర్తిగా తెలియదని.. పొరపాటున తప్పు సినిమా చేస్తున్న విషయం కూడా తనకు తెలియదని.. అలా తన కెరీర్‏లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించానని.. మరికొన్ని సినిమాలు డిజాస్టర్స్‏గా మిగిలిపోయాయని చెప్పుకొచ్చింది.

Also Read: Puneeth Raj Kumar: పునీత్ మరణంతో శోకసంద్రంలో చిత్రపరిశ్రమ.. ఆ కోరిక తీరకుండానే అనంతలోకాలకు అప్పు..

Nawazuddin Siddiqui: ఇక పై వెబ్ సిరీస్‏లలో నటించను.. ఓటీటీ కంటెంట్ నచ్చట్లేదు.. నవాజుద్ధీన్ షాకింగ్ కామెంట్స్..