హానీ రోజ్.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈపేరుఇప్పుడు ఓ రేంజ్లో మారుమ్రోగుతోంది. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహరెడ్డి సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చెక్కించే ఫోజులతో రచ్చ చేస్తుంది. వీరసింహ రెడ్డి సినిమాతో ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క సినిమాతోనే కావాల్సినంత గుర్తింపు సంపాదించేసుకుంది. ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హానీ రోజ్.. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా సినిమాలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోవడంతో హానీకి కూడా అంతగా గుర్తింపు రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రి ఇచ్చి సక్సెస్ అయ్యింది హానీ రోజ్. ప్రస్తుతం హానీరోజ్ నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది హానీ.
ఇటీవల విజయవాడలోని ఓ బేకరి ఓపెనింగ్ కు వెళ్లిన హానీ.. నటనపై తనకున్న ఆసక్తి.. పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హానీ. అలాగే తాను ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. కేరళ ఆహారం అంటే తనకు చాలా ఇష్టమని.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేదని తెలిపింది. అయితే వరుడు ఎవరు.. ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుతం హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వీరసింహ రెడ్డి సినిమా తర్వాత హానీ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణ తదుపరి చిత్రంలోనూ హానీ రోజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో యువకథానాయిక శ్రీలీల నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.