ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను.. నన్ను క్షమించండి.. హీరోయిన్ ఎమోషల్ కామెంట్స్

ఏప్రిల్ 22న బైసరన్ వ్యాలీలో రెసిస్టెన్స్ ఫోర్స్ (RTF)కి చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్‌ భారతానే కాదు ప్రపంచాన్ని కూడా తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అదీ మతం అడిగి మరీ దాడులకు పాల్పడటం ప్రతి ఒక్కరి రక్తం మరిగించింది. దీనికి ప్రతీకార చర్యగా భారత్‌ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను.. నన్ను క్షమించండి.. హీరోయిన్ ఎమోషల్ కామెంట్స్
Actress

Updated on: Apr 25, 2025 | 1:58 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం నాడు మరణించిన పర్యాటకుల పట్ల యావత్‌ దేశం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. మృతులకు నివాళులు అర్పించిన ప్రజలు..పాకిస్తాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఉగ్రవాద దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ ఈ ఉగ్రదాడి పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను అని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే..

బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ బుల్లితెర ద్వారా పాపులర్ అయ్యింది. హీనా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ 11 తర్వాత హీనా ఖాన్ ఏక్తా కపూర్ నటించిన నాగిన్ 5లో కనిపించింది. హీనా ఖాన్ హ్యాక్డ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ముఖ్యపాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్.. ఇప్పటికి కీమోథెరపీ సెషన్‌లను పూర్తి చేసుకుంది. అయితే ఈ సెషన్‌లు పూర్తయిన తర్వాత కూడా హీనా ఖాన్ కీమోథెరపీ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ అమ్మడు ఉగ్రదాడి పై స్పందించింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సంతాపం తెలుపుతున్నాను. అది ఓ చీకటి రోజు. కనీసం మానవత్వం లేకుండా దాడి చేశారు. తమను తాము ముస్లింలుగా చెప్పి.. ఎదుటి వారిపై జాలి  చూపకుండా కాల్పులు చేశారు. దీన్ని ఖండిస్తున్నాను. అలాగే ఓ ముస్లింగా సిగ్గు పడుతున్నాను. భారతదేశంలో ఉన్న హిందువులందరికీ, నా తోటి భారతీయలకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబసభ్యుల కోసం ప్రార్థిస్తున్నాను అంటూ హీనా ఖాన్ చెప్పుకొచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..