
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్స్ సైలెంట్ అవ్వడంతో కుర్ర హీరోయిన్స్ హవా పెంచేశారు. చాలా మంది యంగ్ బ్యూటీస్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ తో అదరగొడుతున్నారు. గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా ముద్దుగుమ్మలు వెనకాడటం లేదు. చాలా మంది హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. ఎక్కువుగా గ్లామర్ పాత్రలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది.. చివరకు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయ్యారు వారిలో హెబ్బా పటేల్ ఒకరు. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదాని పేరు మారుమ్రోగింది. వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు నటించిన నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది.
కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ కాలేదు. దాంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. అయినా కూడా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతుంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా హెబ్బా గ్లామర్ రోల్స్ లో నటించడం పై షాకింగ్ కామెంట్స్ చేసింది. హెబ్బా పటేల్ గ్లామర్ పాత్రలు చేయడానికి కారణం అప్పట్లో ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అని తెలిపింది. అప్పుడు అలాంటి పాత్రల గురించి నన్ను గైడ్ చేసేవాళ్లు లేరు. దాంతో ఆ సినిమాలను, అలాంటి పాత్రలను నేను ఒక జాబ్ లాగానే చేశాను. డబ్బులు తీసుకున్నాను.. ఇప్పుడు నేను బాగా సెటిల్ అయ్యాను.. ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నా.. అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.