Hansika: ప్రతీ మనిషి జీవితంలో ఒకరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారినే మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం, ఆరాధిస్తుంటాం. వారితో మనకున్న సాన్నిహిత్యాన్ని, బంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. తన జీవితంలో అలాంటి వ్యక్తి తన తల్లే అని చెబుతోంది నటి హన్సిక. శుక్రవారం హన్సిక మధర్ మోనా మాత్వాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా హన్సిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. మోనా యంగ్ ఏజ్‌లో ఉన్న ఫొటోలతో పాటు తన తల్లితో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన హన్సిక.. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మ.. నువ్వు నాకు ఎంత ముఖ్యమో మాటల్లో వర్ణించలేను. మీరే మా ప్రపంచం.. మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇదిలా ఉంటే హన్సిన తల్లి.. మోనా ఒక డెర్మటాలజిస్ట్. హన్సిక చిన్నతనంలోనే అతని తండ్రి ప్రదీప్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో మోనానే తన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించారు. హన్సికకు ఒక సోదరుడు ఉన్నారు.
ఇక హన్సిక సినీ కెరీర్ విషయానికొస్తే బాల నటీగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక 16 ఏళ్ల వయసులోనే ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ క్యూట్ గర్ల్.. కుర్రకారును ఆకట్టుకున్నారు. అనంతరం తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక హన్సిక గతంలో శింబుతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి కూడా.
Also Read: kajal: ఆ విషయాన్ని ప్రతీరోజూ గుర్తుంచుకోవాలని చెబుతోన్న చందమామ.. ఆసక్తిర పోస్ట్ చేసిన కాజల్.
ఆ మాటతో అడవి శేష్ ఫ్యూజులు ఎగిరిపోయాయట… సినిమా ఆగిపోతుందని అనుకున్నాడట..కానీ