హా..హా.. హాసిని.. అంటూ తన అల్లరి చేష్టలతో.. క్యూట్ యాక్టింగ్‌తో తెలుగు కుర్రకారు మనసు దొచుకుంది జెనీలియా. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి నితిన్, రామ్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, హిందీలోనూ స్టార్ హీరోయిన్స్‌లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది జెనీలియా. కెరీర్ ఫుల్ దూసుకెళ్తున్న సమయంలోనే హిందీలో స్టార్ హీరోగా ఉన్న రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరంగా ఉంటూ.. పూర్తి సమయాన్ని తన కుటుంబానికి కేటాయించింది. ఈరోజు (ఆగస్ట్ 5న) జెనీలియా పుట్టిన రోజు.
అయితే తెలుగులో వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న సమయంలోనే హీరో రితేశ్ దేశ్ముఖ్తో ప్రేమలో ఎలా పడిందో తెలుసుకుందామా. జెనీలియా మొదటగా హిందీలో తుజే మేరీ కసమ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రితేశ్ హీరోగా నటించాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగింది. అయితే రితేశ్ రాజకీయ నాయకుడి కుమారుడు కావడంతో.. అతని స్వభావం కూడా రాజకీయ నాయకుల మాదిరిగానే ఉంటుందని జెనీలియా అనకుందట. అంతేకాదు… రితేశ్‌తో మాట్లాడటానికి ఆసక్తి చూపించేదాన్ని కాదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. జెనీలియా అనుకున్న దానికి భిన్నంగా రితేశ్ సెట్లో అందరితో కలిసిపోయి.. అల్లరిగా ఉండడం చూసి మొదట్లో కొంత ఆశ్చర్యం కలిగేదట. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఈ మూవీ షూటింగ్ తర్వాత రితేశ్ తిరిగి ముంభై వెళ్లగా.. జెనీలియా.. ఇతర చిత్రాలలో నటిస్తూ హైదరాబాద్‌లోనే ఉండిపోయింది.
అయితే షూటింగ్ అనంతరం వీరిద్దరూ ఒకరినొకరు చాలా మిస్సయ్యారట. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిందట. అలా దాదాపు 9 సంవత్సరాల పాటు వీరిద్ధరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచినట్లుగా ఈ జంట తెలిపింది. దాదాపు 9 ఏళ్ల ప్రేమ తర్వాత 2012 ఫిబ్రవరి 3న వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉంటే… గత కొద్ది రోజులుగా జెనీలియా తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ట్వీట్..
Also Read: Thamannah: తమన్నా ఆరాటం.. మిల్కీ బ్యూటీ సాహసం మాములుగా లేదుగా.. అభినందిస్తున్న నెటిజన్స్..