
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాలో కీలకపాత్రలో నటించింది గాయత్రి గుప్తా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, ఐస్ క్రీమ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించింది ఈ తెలుగమ్మాయి. షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన గాయత్రి సినిమాల్లో హీరోయిన్ గా నటించలేకపోయింది. ఫిదా సినిమాతో పాపులారిటి సొంతం చేసుకున్న గాయత్రి మాస్ మాహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. ఇవే కాకుండా తెలుగులో బుర్రకథ, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్ వంటి చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న గాయత్రి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సీని ప్రయాణం గురించి, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. అలాగే ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ క్రిటికల్ ఉందని.. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకొచ్చింది.
తన ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నాని.. అలాగే తన తండ్రిని ఎప్పుడు ఫాదర్ గా భావించలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక గాయత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. తన అనారోగ్య సమస్య ఏంటన్నది పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇక గతంలో తన ప్రియుడు తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది.
ఇక గాయత్రి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ చేస్తుంది. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, విష్ణు ప్రియా ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ దయలో నటించింది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.