Eesha Rebba: ‘తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు రావడం లేదు.. కానీ’ ఈషా రెబ్బ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Jul 10, 2023 | 11:33 AM

ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన సస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేయాల్సి వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ బ్యూటీ.

Eesha Rebba: తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు రావడం లేదు.. కానీ ఈషా రెబ్బ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Eesha Rebba
Follow us on

తెలుగు అమ్మాయిలకు మన దగ్గర అవకాశాలు రావు అంటూ ఇప్పటికే చాలా మంది కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మొన్నీమధ్య మంచు లక్ష్మీ కూడా తెలుగు అమ్మాయిలకు ఏం తక్కువ అందం లేదా.? ప్రతిభ లేదా ఎందుకు అవకాశాలు రావడం లేదు అంటూ ప్రశ్నించారు. తాజాగా మరో అమ్మడు కూడా దీని పై కామెంట్స్ చేసింది. ఆ చిన్నది ఎవరో కాదు అందాల భామ ఈషా రెబ్బ. ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన సస్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేయాల్సి వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈ బ్యూటీ. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడు గుర్తింపు తెచుకోలేకపోయింది. దాంతో తమిళ్ లోనూ అవకాశలకోసం ట్రై చేసింది. ఓయ్ అనే సినిమా తమిళ్ లో చేసింది. అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తుంది. తమిళ్ లో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈషా రెబ్బ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు రావు అంటుంది ఈషా రెబ్బ. నేను ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నా.. అక్కడి వారందరు మన టాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకు నేనెంతో గర్వపడుతున్నా.. కానీ మనదగ్గర తెలుగు వచ్చిన వారికంటే వేరే వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు అని అంటుంది ఈషా రెబ్బ. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. గ్లామర్ ఫొటోలతో అభిమానులను కట్టిపడేస్తుంది ఈ చిన్నది.