Avika Gor: ‘మనిషిగా నాలో చాలా మార్పులొచ్చాయి.. చాలా విషయాలు అర్థం చేసుకుంటున్నాను’.. అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Feb 10, 2023 | 6:29 AM

పాప్‌కార్న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించట‌మే కాకుండా ప్రొడ్యూసర్‌గానూ పరిచయమవుతున్నారు. అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’.

Avika Gor: మనిషిగా నాలో చాలా మార్పులొచ్చాయి.. చాలా విషయాలు అర్థం చేసుకుంటున్నాను.. అవికా గోర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Avika Gor
Follow us on

అవికా గోర్‌ మనకు చిన్నారి పెళ్లికూతురుగా తెలుసు. ఉయ్యాల జంపాలా హీరోయిన్‌గానూ తెలుసు. పలు చిత్రాలు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారక్టర్స్ చేసిన అమ్మాయిగా తెలుసు. ఇప్పుడు పాప్‌కార్న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించట‌మే కాకుండా ప్రొడ్యూసర్‌గానూ పరిచయమవుతున్నారు. అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ముర‌ళి గంధం ద‌ర్శ‌క‌త్వంలో భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 10న విడుదల కానున్న పాప్‌కార్న్ గురించి, అందులో నటన, నిర్మాణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవికాగోర్‌.

ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ.. “కథ వినగానే, నా పరంగా ఎక్కువ టైమ్‌, అటెన్షన్‌ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైంది. నటిగా సెట్‌కి వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తాం. కానీ నిర్మాతగా అయితే, అన్నీ విషయాలనూ పట్టించుకుంటాం. సినిమా ఎలా రావాలి? ఎలా ప్రమోట్‌ చేయాలి? స్క్రిప్ట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ కావాలంటే ఇంకేం చేయొచ్చు… ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. నేను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ సినిమా కథ వినగానే, ఇదే పర్ఫెక్ట్ టైమ్‌ అనిపించింది. అందుకే ఫస్ట్ స్టెప్‌ వేశాను. జీవితంలో ఫలానా చేయాలనే గోల్‌ మన మనసులో మెదిలిందంటేనే, దాని అర్థం.. మనం చేయగలమనే. మనం కేపబుల్‌ కాకపోతే, మన మనసులోకి ఆలోచనలు రావు. ప్రొడక్షన్‌ చేయాలని ఓ అర్ధరాత్రి అనుకున్నది కాదు. 21 ఏళ్ల వయసు నుంచీ అనుకుంటున్నా. న్యూ యార్క్ అకాడమీకి వెళ్లి చదువుకున్నా, ఎడిటింగ్‌ కోర్సులు చేసినా, డైరక్షన్‌ కోర్సులు చేసినా, దాని అర్థం ఏంటంటే నేను సినిమాను అంతగా ప్రేమిస్తున్నానో అని. నటిగా మాత్రమే కొనసాగకుండా, సినిమాల్లో ఇంకా చాలా చేయాలని అనుకున్నా. ప్రొడక్షన్‌ చేయడం కూడా అందులో భాగమే. భవిష్యత్తులో నేను డైరక్షన్‌ కూడా చేస్తానేమో.

తెలుగులో చాలా మంచి పాత్రలు చేశా. థాంక్యూలో నేను చైకి రాఖీ కట్టాను. చాలా మంచి కేరక్టర్‌ అది. హ్యాష్‌ట్యాగ్‌ బ్రో వల్ల మనిషిగా నాలో చాలా మార్పులొచ్చాయి. ఏ పాత్ర చేసినా దాని వల్ల మనలో మార్పు చూసుకుంటాం. నేను అలా మంచి విషయాలను అర్థం చేసుకుని, నన్ను నేను మలచుకుంటాను. తెలుగు సినిమాలు కొన్ని చేస్తున్నా. త్వరలోనే అనౌన్స్ మెంట్లు వస్తాయి. హిందీలో మహేష్‌భట్‌, విక్రమ్‌భట్‌ సినిమా 1920లో చేస్తున్నా. మేలో ఆ సినిమా విడుదలవుతుంది.” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.