వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్.. ఇండస్ట్రీలో కలకలం

వ్యభిచార కేసులో అడ్డంగా బుక్ అయిన హీరోయిన్. ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నిజం చెప్పాలంటే, వ్యభిచార అరెస్ట్ అవ్వడం, అందులో ఒక నటి పేరు బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి.

వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దొరికేసిన హీరోయిన్.. ఇండస్ట్రీలో కలకలం
Actress

Updated on: Sep 28, 2026 | 1:09 PM

మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్ కేసు కలకలం రేపుతోంది. వాగ్లే ఎస్టేట్ పరిధిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో పోలీసులు నిర్వహించిన సర్చ్ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఓ నటిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. థానే పోలీసులకు అక్కడ  ఓ సినీ నటి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తుందని సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు పక్కా ప్లాన్ తో వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌పై నిఘా పెట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన డీకాయ్ ఆపరేషన్‌లో అసలు బండారం బయటపడింది. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. కాగా వ్యభిచార కార్యకలాపాలు నడిపిస్తున్న మహిళ హిందీ వెబ్‌సిరీస్‌లు, భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్ గా నటించిందని తెలుస్తుంది.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

ఈ కేసులో అరెస్టయిన మహిళ గతంలో హిందీ వెబ్‌సిరీస్‌లు, భోజ్‌పురి చిత్రాల్లో నటించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమె సుమారు 10 వెబ్‌సిరీస్‌లు, మూడు భోజ్‌పురి సినిమాల్లో పనిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఒక్కో కస్టమర్ నుంచి సుమారు రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అందులో రూ.10 వేలు సంబంధిత మహిళలకు ఇచ్చి, మిగిలిన రూ.15 వేల మొత్తాన్ని తాను తీసుకున్నట్లు ఆ నటి పోలీసులకు  తెలిపిందని సమాచారం.

వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

ఈ కేసు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే కాదు దీని వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉందా.? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన నటికి మరికొందరితో సంబంధాలు ఉన్నాయా.? గతంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిందా.? అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు రక్షించిన ఇద్దరు మహిళల వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు.. వారి బ్యాగ్రౌండ్, ఈ వ్యవహారంలోకి వారు ఎలా వచ్చారు, ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా.? వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే అరెస్టయిన నటి ఫోన్ కాల్స్, పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర వివరాలను పోలీసులు రాబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్‌ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us