
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమా తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టు.. కలువ కళ్లతో తొలి చూపులోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. ఈ సినిమా తర్వాత శతమానం భవతి సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ ఇప్పటివరకు స్టార్ హీరో సినిమాల్లో మాత్రం ఛాన్స్ అందుకోలేకపోయింది. ఇటీవల నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కేరళ కుట్టి .. ఇప్పుడు డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అను ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం గ్లామర్ హద్దులను చెరిపేస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇన్ స్టాలో అనుపమ అసలు హీరోయిన్ మెటిరియలే కాదంటూ కామెంట్ చేసాడు.
“నువ్వు పెద్ద హీరోయిన్ వి ఏమీ కాదు.. అందుకే నీకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు. అసలు మీరు హీరోయిన్ మెటిరియలే కాదు.” అంటూ కామెంట్ చేయగా.. తనస్టైల్లో కౌంటరిచ్చింది అనుపమ. మీరు చెప్పింది నిజమే అన్నయ్య.. నేను హీరోయిన్ మెటిరియల్ కాదు.. కానీ యాక్టర్ టైప్ అంటూ గట్టిగానే ఇచ్చిపడేస్తూ.. స్మైలీ ఎమోజీలను షేర్ చేసింది. ఇది చూసిన నెజిటన్స్ అనుకు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది అనుపమ. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన 18 పేజీస్ చిత్రం సైతం హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె డీజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తుండగా.. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.