Anupama -Regina Cassandra: ప్రేమ.. ద్రోహం.. ప్రతీకారం అంటోన్న అనుపమ, రెజీనా.. ఇంట్రెస్టింగ్‏గా ఫస్ట్ లుక్..

టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర (Regina Cassandra), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) ప్రధాన పాత్రలలో డైరెక్టర్ సతీష్ కాశెట్టి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Anupama -Regina Cassandra: ప్రేమ.. ద్రోహం.. ప్రతీకారం అంటోన్న అనుపమ, రెజీనా.. ఇంట్రెస్టింగ్‏గా ఫస్ట్ లుక్..
Anupama Resina

Updated on: Jul 14, 2022 | 4:08 PM

వైవిధ్యమైన సినిమాలు చేసేందుకు కథానాయికలు ఆసక్తి చూపిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు పెద్ద పీట వేస్తున్నారు స్టార్ హీరోయిన్స్. ఇప్పటికే సమంత, కాజల్, సాయి పల్లవి వంటి అగ్రకథానాయికలు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా కసాండ్ర (Regina Cassandra), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) ప్రధాన పాత్రలలో డైరెక్టర్ సతీష్ కాశెట్టి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు మరిచీక అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మరిచీక అంటే అర్థం ఎండమావి. అంటే.. కళ్లను కనికట్టు చేసే భ్రమ. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కేవలం అమ్మాయి పాదాలు మాత్రమే కనిపిస్తుండగా.. వాటి ప్రతిబింబం నీళ్లలో ఓ అమ్మాయి నీడ కనిపిస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్స్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి ప్రేమ.. ద్రోహం.. ప్రతీకారం అనేది క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. విజయ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వన్ మోర్ హీరో బ్యానర్ పై రవి చిక్కాల నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.