Anjali: కాబోయేవాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలి.. అంజలి కోరికలు మాములుగా లేవుగా

|

Jun 13, 2023 | 5:54 PM

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్ల గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక తెలుగమ్మాయి అంజలి పెళ్లి గురించి కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ అంజలి గురించి తెలియని వారు వుండరు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ్ లో సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకుంది.

Anjali: కాబోయేవాడికి అలాంటి క్వాలిటీస్ ఉండాలి.. అంజలి కోరికలు మాములుగా లేవుగా
Anjali
Follow us on

హీరోయిన్స్ తమ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ అభిమానులు హాట్ టాపిక్ గా మారుతుంటారు. హీరోయిన్ పెళ్లి గురించి నిత్యం రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పెళ్లిళ్ల గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక తెలుగమ్మాయి అంజలి పెళ్లి గురించి కూడా ఇప్పటికే చాలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ అంజలి గురించి తెలియని వారు వుండరు. తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ్ లో సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకుంది. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఇక ఆతర్వాత జర్నీ సినిమాతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ అమ్మడు ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ లోనూ అలరిస్తోంది. ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఓ యంగ్ హీరోతో అంజలి ప్రేమాయణం నడిపిందని గతంలో టాక్ వినిపించింది. ఆ తర్వాత ఈ ఇద్దరి గురించి మళ్లీ వార్తలు రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా అంజలి తనకు కాబోయేవాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రిలేష‌న్‌షిప్‌లో ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి మ‌ర్యాద చాలా ముఖ్యం అంటుంది ఈ చిన్నది. అలాగే మర్యాద లేని వ్యక్తి ఎప్పటికీ ఒప్పుకోను అంటుంది అంజలి. అలాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకొను అంటుంది అంజలి. కెరీర్, రిలేష‌న్‌షిప్‌ రెండు నాకు ముఖ్యం అంటుంది ఈ బ్యూటీ.