
అనికా సురేంద్రన్..! అజిత్ విశ్వాసం సినిమాతో.. చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ పాప.. రీసెంట్ గా హీరోయిన్‌గా మారిపోయింది. నాగ్ ఘోస్ట్ సినిమాతో ఇటీవల మన ముందుకు వచ్చింది. ఇక ఆ తరువాత బుట్టబొమ్మ సినిమాతో..అటు తెలుగులోనూ.. ఇటు కోలీవుడ్‌లోనూ రీసెంట్‌గా రీసౌండ్ చేసింది. వరస సినిమాలు చేసుకుంటూ.. కోలీవుడ్ లో బిజీగా కూడా మారింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం అందర్నీ షాక్ అకయ్యేలా చేసింది.
ఎస్! ఓ పక్క తన ఫిల్మ్ కెరీర్లో బిజీగా ఉంటూనే.. తన సోషల్ మీడియా హ్యండిల్లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్కు అందుబాటులో ఉంటుంది అనిక. తన డ్యాన్స్ రీల్స్ అండ్ ఫోటోషూట్స్తో.. వీడియోలతో ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అలాంటి ఈ బ్యూటీపై తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. ఈమె చనిపోయిందంటూ.. కొన్ని పోస్టర్స్ నెట్టింట వైరల్ అవ్వడం.. అందర్నీ షాకయ్యేలా చేసింది. కానీ ఓ సినిమా కోసం చేసిన పోస్టర్ ఇదని ఆ తరువాత తెలియడంతో.. అందర్నీ నెమ్మదించేలా చేసింది.