Andrea Jeremiah: కెరీర్‏లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆండ్రియా… ‘పిశాసు-2’ సినిమాలో సీన్ కోసం రిస్క్ చేసిన హీరోయిన్..

ఆండ్రియా.. తమిళ సినీ పరిశ్రమతోపాటు.. తెలుగు చిత్రసీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా.. గాయనిగా..

Andrea Jeremiah: కెరీర్‏లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆండ్రియా... పిశాసు-2 సినిమాలో సీన్ కోసం రిస్క్ చేసిన హీరోయిన్..
Andrea Jeremiah

Updated on: Jun 16, 2021 | 5:06 PM

ఆండ్రియా.. తమిళ సినీ పరిశ్రమతోపాటు.. తెలుగు చిత్రసీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా.. గాయనిగా.. మల్టీటాలెంటెడ్‍తో ప్రేక్షకులకు దగ్గరైంది. స్టోరీకి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ పాత్ర కోసం తానను తాను మార్చుకోవడానికి సిద్ధమవుతుంటుంది. ఇదిలా ఉంటే.. ఆండ్రియా ప్రస్తుతం పిశాసు 2 సినిమాలో నటిస్తుంది. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన పిశాసు మూవీకి సీక్వెల్ గా పిశాసు 2 ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆండ్రియా ఓ సన్నివేశంలో బోల్డ్ గా నటించదట. సన్నివేశం డిమాండ్ చేయడంతో దర్శకుడి వినతి మేరకు ఆండ్రియా ఆ సీన్ చేయడానికి ఒప్పుకుందట. కేవలం కొందరి సమక్షంలో షూట్ జరిగినట్లుగా టాక్. ఇప్పుడు ఇదే విషయం పై కోలీవుడ్‏లో చర్చలు నడుస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు ఆండ్రియా కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ మూవీ సూపర్ హిట్ అయితే మాత్రం ఆండ్రియాకు ఆఫర్స్ పెరగడం మాత్రం ఖాయం. ఈ సినిమాలో పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తర్వలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Also Read: Health Benefits of Laughing: నవ్వంటే బ్రెయిన్‌కు లవ్‌.. లాఫింగ్ వ‌ల్ల‌ క‌లిగే అద్భుత‌మైన‌ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఇవే

Sarkaru Vari Paata Movie: మహేష్ ఫ్యాన్స్‏కు తమన్ హామీ.. ‘సర్కారు వారి పాట’ మూవీలో సాంగ్స్ అలా ఉండనున్నాయంటూ..

Footwork Challenge: ‘మాలో ఎవరు బాగా చేశారని’ క్రికెటర్ చాహల్ ప్రశ్న? కపుల్ ఫుట్ వర్క్ ఛాలెంజ్‌ వీడియోతో ఆకట్టుకున్న జోడీ!

RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?