Pushpa: పుష్ప డైలాగుతో ఆకట్టుకున్న ఎంపీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Navneet Kaur Rana: టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం పుష్ప (Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Pushpa: పుష్ప డైలాగుతో ఆకట్టుకున్న ఎంపీ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Navneeth Kaur

Updated on: Mar 20, 2022 | 1:32 PM

Navneet Kaur Rana: టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం పుష్ప (Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఓటీటీలోనూ, టీవీల్లోనూ ప్రసారమైంది. అయితే పుష్పరాజ్‌ ఫీవర్‌ మాత్రం ఇంకా తగ్గడం లేదు. బన్నీ డైలాగులు, మేనరిజమ్స్ నెటిజన్లతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు, క్రికెటర్లు అనుకరిస్తున్నారు. వీటికి నెట్టింట్లోనూ మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర ఎంపీ, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్‌ నవనీత్ కౌర్ రాణా (Navneet Kaur Rana) కూడా చేరారు. సినిమాలోని ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్’ అనే డైలాగ్ హిందీ వెర్షన్ పలుకుతూ పిల్లలతో రచ్చ చేశారీ అందాల తార. అనంతరం దీనికి సంబంధించిన వీడియో ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా 2003 లో విడుదలైన శీను వాసంతి లక్ష్మి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు నవనీత్ కౌర్. ఆతర్వాత జగపతి, గుడ్‌బాయ్‌, రూమ్‌మేట్స్‌, యమదొంగ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆపై కన్నడ, మలయాళ, పంజాబీ భాషల్లోనూ నటించారు. కాగా పన్నేండేళ్ల క్రితమే ఆమె ముఖానికి రంగు వేసుకోవడం మానేశారు. 2011లో రవిరాణా అనే రాజకీయ వేత్తను వివాహం చేసుకుంది. ఆతర్వాత భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ అమరావతి ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు.

Also Read: Makeup Tips: మేకప్ వేసుకునేందుకు మొటిమలు ఇబ్బందిగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలతో అద్భుతాలు చేయవచ్చు..

ఉప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారా

ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటమెన్