నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

| Edited By: Srinu

Jun 27, 2019 | 8:30 PM

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆమె సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల..అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 50 సినిమాల్లో జంటగా నటించారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.  11 ఏళ్ల […]

నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత
Follow us on

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ఆమె సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే. 1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల..అత్యధిక చిత్రాల్లో క‌ృష్ణ పక్కనే హీరోయిన్‌గా నటించారు. వీరిద్దరూ కలిసి 50 సినిమాల్లో జంటగా నటించారు. ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా..ఆమె గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రఘుపతి వెంకయ్య అవార్డును కూడా అందుకున్నారు.  11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో నటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విజయ నిర్మల..రంగుల రాట్నం చిత్రంతో హీరోయిన్ పరిచయం అయ్యారు.