Amala Paul: నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు.. అమలాపాల్ ఇలా అనేసిందేంటీ..!

|

Jul 26, 2024 | 3:06 PM

రీసెంట్ డేస్ లో అమలాపాల్ తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళ్ లోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఆడుజీవితం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే తాజాగా అమలా పాల్ ను నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అమలాపాల్ ధరించిన బట్టల పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Amala Paul: నా డ్రస్సు నా ఇష్టం.. తప్పు నాది కాదు.. అమలాపాల్ ఇలా అనేసిందేంటీ..!
Amala Paul
Follow us on

అందాల భామ అమలాపాల్ కు తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. తెలుగులో ఈఅమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. రీసెంట్ డేస్‌లో అమలాపాల్ తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళ్‌లోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా ఆడుజీవితం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే తాజాగా అమలా పాల్ ను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అమలాపాల్ ధరించిన బట్టల పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా అమలాపాల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ కాలేజ్ కు వెళ్ళింది. అయితే ఆమె ధరించిన డ్రస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ డ్రస్‌లో అమలాపాల్ అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

దాంతో ఆమె బోల్డ్ దుస్తులు ధరించిందని పలువురు విమర్శించారు. కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లే తప్పుడు ఇలాంటి డ్రస్ వేసుకుంటావా అంటూ ఆమె పై ఫైర్ అయ్యారు. తాజాగా తన పై వస్తున్న విమర్శల పై అమలాపాల్ స్పందించింది. త్వరలో విడుదల కాబోతున్న ‘లెవల్ క్రాస్’ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు. నా డ్రెస్సింగ్‌ స్టైల్‌ను కెమెరామెన్స్ ఎలా చూపిస్తారనే విషయంలోనే సమస్య ఉంది’ అని తెలిపింది.

ఇది కూడా చదవండి : Bigg Boss Season 8: పెద్ద ప్లానే..! హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..

హీరోయిన్లు కాస్త బోల్డ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ కు వస్తే.. వాళ్లను రకరకాల కోణాల్లో ఫోటోలు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ ఉంది. బాలీవుడ్ లో ఈ ఆరోపణ  వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అమలాపాల్ కూడా దీనిపై మాట్లాడింది. ‘నా దుస్తులను కెమెరాలు ఎలా చూపిస్తాయన్నది సమస్య. నాకు సంతోషాన్నిచ్చేదాన్ని నేను ధరిస్తాను. నేను ఫంక్షన్ల కోసం మాములు దుస్తులు ధరించను. వారు నన్ను ఎలా ఫోటోలు తీస్తున్నారు అనేదే సమస్య. దాన్ని అదుపు చేయడం నా చేతుల్లో లేదు’ అని తెలిపింది. అలాగే ‘నేను రకరకాల డ్రెస్సులు వేసుకుంటాను. నేను మోడ్రన్ అలాగే సాంప్రదాయ దుస్తులను కూడా ధరిస్తానని చెప్పుకొచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ సినిమాలో అమలా పాల్ నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

అమలాపాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి