Aishwarya Rajesh: క్యారెక్టర్‏కు మాత్రమే ప్రాధాన్యత.. గ్లామర్ పాత్రలు అస్సలు చేయను.. తెలుగమ్మాయి ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Sep 27, 2021 | 7:39 AM

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగాలంటే గ్లామర్ షో ఉండాల్సిందే. మేకర్స్ చెప్పినట్టు తనను మార్చుకుంటే..

Aishwarya Rajesh: క్యారెక్టర్‏కు మాత్రమే ప్రాధాన్యత.. గ్లామర్ పాత్రలు అస్సలు చేయను.. తెలుగమ్మాయి ఆసక్తికర వ్యాఖ్యలు..
Aishwarya Rajesh
Follow us on

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‏గా కొనసాగాలంటే గ్లామర్ షో ఉండాల్సిందే. మేకర్స్ చెప్పినట్టు తనను మార్చుకుంటే.. హీరోయిన్‏గా ఎదిగేందుకు వీలుంటుందనేది ఫిల్మ్ వర్గాల్లో టాక్. అయితే ఇప్పుడున్న హీరోయిన్స్‏లలో కొందరు మాత్రమే తమ కట్టు బొట్టును ఏమాత్రం మార్చుకోకుండా.. గ్లామర్ షోలకు ఆరడుగుల దూరంలో ఉంటూ.. సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది సాయి పల్లవి. ఇక ఆ తర్వాత మన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్, అంజలి, రీతూవర్మ వంటి వారు గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్స్‏గా దూసుకుపోతున్నారు. అయితే .. తను కేవలం క్యారెక్టర్‏కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని.. గ్లామర్ పాత్రలు అస్సలు చేయనని స్పష్టం చేసింది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఈ అమ్మడు.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన రిపబ్లిక్ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తోంది. డైరెక్టర్ దేవా కట్టా తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా.. ఐశ్వర్య రాజేష్.. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ఐశ్వర్య మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించే ఐఏఎస్ అధికారి కథ ఇది. వాణిజ్య అంశాలకు సామాజిక ఇతివృత్తాన్ని మేళవిస్తూ.. డైరెక్టర్ దేవా కట్టా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోహీరోయిన్స్ అనే విభజన ఆయనకు నచ్చదు. ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యతనిస్తూ.. సినిమాను రూపొందించారు. కథ నచ్చడంతోపాటు అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో సినిమాకు ఓకే చెప్పాను. మైరా అనే ఎన్ఆర్ఐ అమ్మాయిగా ఇందులో కనిపిస్తాను. తనకు ఎదురైన ఓ సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ.. స్వదేశానికి వచ్చిన ఆమె ఎలాంటి సంఘటనలు ఎదుర్కోంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే డ్యూయెట్స్, లవ్ సీన్స్ ఇందులో కనిపించవు అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే సినిమాల ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుందని నమ్ముతాను. మంచి చెబితే తప్పకుండా స్వీకరిస్తారు. తెలుగులో కమర్షియాలిటీ కన్నా వాస్తవికతను ప్రాముఖ్యతనిచ్చే ధోరణి పెరిగింది. గ్లామర్ కంటే అభినయంతోనే కథానాయకలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో అలాంటి పాత్రల కోసం నేను ఎదురుచూస్తున్నా.. గ్లామర్ పాత్రలను నేను చేయలేను. భీమ్లా నాయక్ సినిమాలో కథనాయిక పాత్ర కోసం చిత్రయూనిట్ నన్ను సంప్రదించింది. కానీ ఆ సినిమా పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలుగులో రాజశేఖర్‏తో ఓ సినిమా చేయబోతున్నాను. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్య రాజేష్.

Also Read: Bigg Boss 5 Telugu: లహరి ఔట్.. ఆ కంటెస్టెంట్‏కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ.. జాగ్రత్త అంటూ చురకలు..

Bigg Boss 5 Telugu: మరోసారి అసలు విషయం బయటపెట్టిన లహరి.. అల అనకండి షణ్ముఖ్ ఫైర్..

Bharat Bandh Live: నేడు భారత్ బంద్.. దేశవ్యాప్త ప్రతిష్టంభన, నిరసనలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు