యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత అమ్ము చిత్రంతో నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇవే కాకుండా డబ్బింగ్ సినిమాలతోనూ అలరించింది. ఇటీవల హీరో విష్ణు విశాల్ జోడిగా మట్టీ కుస్తీ సినిమాలో కనిపించింది. ఈ మూవీతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా అయ్యింది ఈ అఏమ్మడు. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే తాను ప్రేమలో పడినట్లు చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడింది మరెవరితోనో కాదండి. సినీ ప్రియులకు సుపరిచితమైన నటుడు కావడం విశేషం. అతనే తమిళ్ నటుడు అర్జున్ దాస్. అతనితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అర్జున్ తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది.
అంతేకాదు తమ ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు పలువురు సినీ తారలు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాస్టర్, విక్రమ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్.. ప్రస్తుతం తెలుగులో బుట్టబొమ్మ సినిమా చేస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇక ఇప్పుడు గతంలో ఐశ్వర్య పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మీకు ప్రేమ పెళ్లి ఇష్టమా ? పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇష్టమా? అనే ప్రశ్నకు ఐశ్వర్య స్పందిస్తూ… తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. లవ్ సింబల్ జత చేసి మరీ అభిమానులకు షాకిచ్చింది ఐశ్వర్య. అయితే వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా ? లేకా.. తమ తదుపరి సినిమా ప్రమోషన్ కోసం ఇలా పోస్ట్ చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.