AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే.. ఆమని..

మిస్టర్ పెళ్ళాం సినిమాతో కెరీర్ ప్రారంభించి, ఇండస్ట్రీలో ఎంతో మంది దిగ్గజాలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు హీరోయిన్ ఆమని. 1993లో ఏడాదికి 10-15 సినిమాలు చేస్తూ, నిరంతరం శ్రమించి తనదైన ముద్ర వేశారు. సినిమా పట్ల ఆమె అపారమైన ప్రేమ, అంకితభావం ఆమెను నటిగా సినీరంగంలో నిలిచిలే చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే.. ఆమని..
Aamani
Rajitha Chanti
|

Updated on: May 09, 2026 | 10:17 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ ఆమని. అప్పట్లో వరుస సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా రాణిస్తుంది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన సుదీర్ఘ కెరీర్‌లోని ముఖ్య ఘట్టాలను, వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన “మిస్టర్ పెళ్ళాం” సినిమాతో ఆమె కెరీర్‌లో ఒక మలుపు తిరిగింది. నటుడు రాజేంద్ర ప్రసాద్ ద్వారా బాపుని కలిసిన వెంటనే ఆ పాత్రకు ఎంపికైనట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కెరీర్ ప్రారంభంలోనే బాపు వంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం అదృష్టంగా భావించారు. తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

1993 సంవత్సరంలో ఆమె పని తీరు అద్భుతమనే చెప్పాలి. ఆ ఏడాది ఆమె సుమారు 10 నుండి 15 సినిమాలలో నటించారు. రాత్రింబవళ్లు షూటింగ్‌లలో పాల్గొంటూ, నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె తెలిపారు. ఒక షూట్ నుండి మరొక షూట్‌కు, ఒక పాత్ర నుండి ఇంకొక పాత్రకు మారడం చాలా కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమ ఆమెను ముందుకు నడిపించాయని వివరించారు. అర రోజు షూట్ లేకపోతే కూడా తనకు బోర్ కొట్టేదని, నైట్ షూటింగ్‌లంటే పండుగలా భావించేదానినని చెప్పారు. ఆ రోజుల్లో 24/7 సినిమా షూటింగ్‌లలోనే ఉండాలని అనిపించేదన్నారు. ఈ క్రేజ్, పిచ్చి ఒకప్పుడు కమల్ హాసన్ కూడా రోజుకు మూడు కాల్ షీట్లు ఇచ్చేవారని చెప్పిన దాంతో పోల్చారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

నేటికీ ఆమెలో అదే ఉత్సాహం, ఏదో సాధించాలనే తపన కనిపిస్తుందని, సెట్స్‌లో ఆమె ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారని ఆమె స్నేహితులు అంటుంటారు. ప్రస్తుతం మంచి మంచి క్యారెక్టర్లు, రోల్స్ చేయాలని, మరింత పేరు తెచ్చుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. మాతృత్వాన్ని, కెరీర్‌ను సమన్వయం చేసుకోవడం గురించి మాట్లాడుతూ, తన పిల్లలు తనకు చాలా అమూల్యులని, వారిని తరచుగా మిస్ అవుతుంటానని తెలిపారు. ఒక తల్లిగా వారికి తన ప్రేమను ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాననే భావన ఉన్నప్పటికీ, కెరీర్ కూడా ముఖ్యమని, ఒక్క రోజు గ్యాప్ దొరికినా పిల్లల వద్దకు వెళ్తానని లేదా వారికి షూటింగ్ ప్రదేశానికి రప్పించుకుంటానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Follow Us